త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | మొహం చాటేసిన వ‌ర‌ణుడు.. రాష్ట్రంలో 28 జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం..

Telangana | వ‌ర‌ణుడు (Rain) మొహం చాటేశాడు. మ‌బ్బులు మ‌చ్చుకైనా క‌నిపించ‌కుండా పోయాయి. జూలై స‌గం గ‌డిచిపోయింది. అయినా వ‌ర్షాల‌ జాడేలేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో (Telangana) తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితి ఏర్ప‌డింది. మొత్తం 33 జిల్లాలకుగాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటు (Deficit Rainfall) నమోదైంది.

G

Telangana | Published On Jul 15, 2026, 6.59 am IST

Telangana | మొహం చాటేసిన వ‌ర‌ణుడు.. రాష్ట్రంలో 28 జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం..
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌ర‌ణుడు (Rain) మొహం చాటేశాడు. మ‌బ్బులు మ‌చ్చుకైనా క‌నిపించ‌కుండా పోయాయి. జూలై స‌గం గ‌డిచిపోయింది. అయినా వ‌ర్షాల‌ జాడేలేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో (Telangana) తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితి ఏర్ప‌డింది. మొత్తం 33 జిల్లాలకుగాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటు (Deficit Rainfall) నమోదైంది. 5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, రంగారెడ్డి, నాగ‌ర్‌క‌ర్నూల్, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట జిల్లాల్లోనే వ‌ర్షపాతం న‌మోద‌యిందని, అవి కూడా లోటుకు ద‌రిదాపుల్లోనే ఉన్నాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ తెలిపింది.

వానాకాలం సీజ‌న్‌లో (Rainy Season)జూన్ ప్రారంభం నుంచి జూలై 14 వ‌ర‌కు వ‌ర్ష‌పాతం లోటు 31 శాతంగా న‌మోద‌యింద‌ని, ఇంత‌వ‌ర‌కు స‌గ‌టు వ‌ర్ష‌పాతం (Rainfall) 228 మిల్లీమీట‌ర్ల‌కుగాను 158.4 మి.మీ. వ‌ర్ష‌మే న‌మోద‌యింద‌ని వెల్ల‌డించింది. ఈ సీజ‌న్‌లో హ‌నుమ‌కొండ జిల్లాలో వ‌ర్ష‌పాతం లోటు అత్య‌ధికంగా ఉంద‌ని తెలిపింది. జిల్లాలో 247 మి.మీ. స‌గ‌టు కాగా, 87 మి.మీ. వ‌ర్ష‌మే కురిసింది. లోటు వ‌ర్షపాతం 64 శాతంగా ఉంద‌ని పేర్కొంది.

ఇప్ప‌ట్లో వాన‌లు లేన‌ట్లే..!

రాష్ట్రంలో మ‌రో వారం రోజుల వ‌ర‌కు వర్షాలు కురిసేలాలేవు. ఈ నెల 20 వరకు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మ‌రోవైపు ఉష్ణోగ్ర‌తలు పెరిగిపోతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar) 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 35.6, ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్ రికార్డ‌యింది.

అడుగంటుతున్న జ‌లాశ‌యాలు..

ఓవైపు వ‌ర్షాలు లేక‌పోవ‌డం.. మ‌రోవైపు జ‌లాశ‌యాల్లో నీళ్లు అడుగంటిపోతుండ‌టం అన్న‌దాత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో కేవలం 1.261 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల) నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 30.31 శాతం నిల్వలుండగా, పదేళ్ల సాధారణ సగటు 19.26 శాతంగా నమోదయ్యేది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 33 శాతం మేర నీటి తగ్గుదల రికార్డయింది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌సంఘం (CWC) వెల్ల‌డించింది.

నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 3.62 శాతానికి పడిపోయింది. సింగూర్‌లో 15.56 శాతం, శ్రీరాంసాగర్‌లో 18.80 శాతం, కడెం ప్రాజెక్టులో 21.85 శాతం, లోయర్‌ మానేర్‌లో 26.02 శాతం, జూరాలలో 33.33 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది.

Advertisement
Advertisement