Dasoju Sravan | ఆరు నెలల్లోనే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రేవంత్
Dasoju Sravan | తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు నెలల్లోనే రేవంత్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని.. కాగ్ నివేదికతో ఇది బట్టబయలైందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఫైరయ్యారు.
- 76.31% వార్షిక అప్పులు హాంఫట్.. 96.6% పెన్షన్ బడ్జెట్ స్వాహా!
- బడ్జెట్ "మిగులు" కాస్తా రూ. 15,096 కోట్ల రెవెన్యూ లోటుగా బోల్తా
- కాగ్ నివేదికతో బట్టబయలైన ఘోర వైఫల్యం
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు నెలల్లోనే రేవంత్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని.. కాగ్ నివేదికతో ఇది బట్టబయలైందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఫైరయ్యారు. శాసనసభ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం తేటతెల్లం చేసిందన్నారు. అప్పులు, గ్యారెంటీల లెక్కలపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలనతో, అడ్డగోలు అప్పులతో ఖజానాను ఖాళీ చేసి, రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థలకే తప్పుడు లెక్కలు చెబుతూ రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టారు. "నాయకత్వానికి కావలసింది ప్రజలకు ఉపయోగపడే పదునైన ఆలోచనలు, అంతేకాని పసలేని రాజకీయ ఆరోపణలు కావు. కొత్త ఆదాయ మార్గాలను వెతకకుండా, ఉన్న ఆస్తులను కరిగిస్తూ పోవడం వల్ల తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంచే తెలివి లేక, ఉన్న ఆస్తులను కరిగించేస్తూ తెలంగాణ పిల్లల భవిష్యత్తును అప్పుల పాలు చేస్తున్నారు అని దాసోజు శ్రవణ్ మండి పడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Saraca Laboratories Limited | సరాకా ఫ్యాక్టరీని మూసేయండి: టీజీపీసీబీ ఆదేశాలు
- ●Nagadurga | మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు - "ఇడుపుకాయితం" సినిమాపై నాగదుర్గ కామెంట్స్
- ●Gadwal Vijaya Lakshmi | ప్రభుత్వంతో మాట్లాడి మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తం
- ●Tummidihetti Barrage | 148? 150? 152? తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఈ సారైనా కొలిక్కి వచ్చేనా?
- ●MP Eatala Rajender | జవహర్ నగర్ డంప్ యార్డ్‌తో గర్భిణులకు గర్భస్రావాలు
- ●మోదీ–రాహుల్ రాజకీయ చదరంగం: ప్రత్యర్థిపై పైచేయి కోసం అసలు వ్యూహాలేంటి?

Saraca Laboratories Limited | సరాకా ఫ్యాక్టరీని మూసేయండి: టీజీపీసీబీ ఆదేశాలు

Nagadurga | మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు - "ఇడుపుకాయితం" సినిమాపై నాగదుర్గ కామెంట్స్

Gadwal Vijaya Lakshmi | ప్రభుత్వంతో మాట్లాడి మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తం

Tummidihetti Barrage | 148? 150? 152? తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఈ సారైనా కొలిక్కి వచ్చేనా?



