త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saraca Laboratories Limited | స‌రాకా ఫ్యాక్ట‌రీని మూసేయండి: టీజీపీసీబీ ఆదేశాలు

Saraca Laboratories Limited | సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ (Saraca Laboratories Limited) పరిశ్రమలో జరిగిన క్లోరోఫామ్ లీకేజీ ప్రమాద ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి చర్యలు చేపట్టింది.

S

Telangana | Published On Oct 23, 2026, 7.03 pm IST

Saraca Laboratories Limited | స‌రాకా ఫ్యాక్ట‌రీని మూసేయండి: టీజీపీసీబీ ఆదేశాలు
Advertisement

Saraca Laboratories Limited | త్రినేత్ర న్యూస్‌: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ (Saraca Laboratories Limited) పరిశ్రమలో జరిగిన క్లోరోఫామ్ లీకేజీ ప్రమాద ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (TGPCB) చర్యలు చేపట్టింది. క్లోరోఫామ్ లీకై ఇద్దరు మృతి చెందిన ఘటన అనంత‌రం ప‌రిస్థితిని స‌మీక్షించి స‌ద‌రు ఫ్యాక్ట‌రీని మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ జనరల్ మేనేజర్ మధు, డిప్యూటీ జనరల్ మేనేజర్ యోగేశ్వర్ రావుల నుంచి శుక్ర‌వారం టీజీపీసీబీ అధికారులు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

గురువారం రాత్రి సుమారు 11:30 గంటలకు క్లోరోఫామ్ లీకేజీ జరిగిందని, ఆవిరికి గురైన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని నారాయణ ఆసుపత్రికి తరలించగా, వైద్యుడు మృతి చెందినట్లు ప్రకటించారని వారు పీసీబీ అధికారులకు వివరించారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్‌-2లో, మొదటి అంతస్తులో ఉన్న రియాక్టర్‌ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసీవర్‌కు క్లోరోఫామ్ ను బదిలీ చేసే ప్రక్రియలో లేయర్ సెపరేషన్ జరుగుతున్న సమయంలో క్లోరోఫామ్ లీకేజీ జరిగినట్లు వారు వెల్లడించారు. లీకైన క్లోరోఫామ్ వేగంగా ఆ ప్రాంతమంతటా వ్యాపించినట్లు టీజీపీసీబీ అధికారులకు తెలిపారు. ఇతర సాంకేతిక కారణాలను వివరించారు.

ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమకు ముందస్తు విచారణ అవకాశం (Opportunity of Hearing) కల్పించకుండానే మూసివేత ఉత్తర్వులు (Closure Order) జారీ చేసింది. పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సంగారెడ్డి పరిధిలోని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) అధికారులకూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement