త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagadurga | మా నాన్న క‌న్నీళ్లు పెట్టుకున్నారు – “ఇడుపుకాయితం” సినిమాపై నాగ‌దుర్గ కామెంట్స్‌

ఇడుపుకాయితం సినిమాపై వ‌చ్చిన ట్రోల్స్‌పై హీరో ప్రియ‌ద‌ర్శి రియాక్ట్ అయ్యారు. స‌బ్‌టైటిల్స్ వేస్తారా? తెలుగులోకి డ‌బ్ చేస్తారా అంటూ వ‌చ్చిన ట్రోల్స్ చూసి బాధ‌ప‌డ్డాన‌ని అన్నారు. ఇడుపుకాయితం సినిమాలోని సాంగ్ ప్రోమో చూసి త‌న తండ్రి క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ని ఫోక్ సింగ‌ర్ నాగ‌దుర్గ చెప్పింది.

N

Movies | Published On Oct 23, 2026, 7.01 pm IST

Nagadurga | మా నాన్న క‌న్నీళ్లు పెట్టుకున్నారు – “ఇడుపుకాయితం” సినిమాపై నాగ‌దుర్గ కామెంట్స్‌
Advertisement

Nagadurga |  ఇడుపుకాయితం సాంగ్‌ ప్రోమో చూసి త‌న తండ్రి క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ని ఫోక్ సింగ‌ర్ నాగ‌దుర్గ అన్న‌ది. ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఇడుపు కాయితం మూవీ డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా వంశీరెడ్డి ద‌ర్‌శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత‌తో క‌లిసి బ‌న్నీవాస్ నిర్మిస్తున్నారు. ఇడుపుకాయితం రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. గ‌డ‌ప అనే పాట‌ను విడుద‌ల చేశారు.

అత్తారింటికి వెళితే..

ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల స‌మావేశంలో నాగ‌దుర్గ మాట్లాడుతూ "మా ఇంట్లో ఏ పనిచేసినా ...నీకు పెళ్లై అత్తారింటికి వెళ్తే తెలుస్తుంది అంటూ అమ్మ ఎప్పుడూ అంటుంది. ఆ మాట ఈ సినిమాలో శ్రీలత పాత్రలో నటిస్తున్నప్పుడు గుర్తొచ్చేది. గడప సాంగ్ ప్రోమో రిలీజ్ కాగానే మా నాన్న ఫోన్ చేసి బాగా నటించావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగదుర్గ నుంచి శ్రీలతగా మారేందుకు చాలా కష్టపడ్డాను. ఆ కష్టాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. శ్రీలత అంటే మా ఇంటి అమ్మాయి మీ ఇంటి అమ్మాయి అందరి ఇళ్లలో ఉండే అమ్మాయి. ప్రాంతీయ బేధం లేకుండా నా పాత్రను ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తార‌నే న‌మ్మ‌క‌ముంది" అని అన్న‌ది.

ట్రోల్స్ బాధ‌పెట్టాయి...

ఇడుపుకాయితం మూవీపై వ‌చ్చిన ట్రోల్స్‌పై ఈ ప్రెస్‌మీట్‌లో హీరో ప్రియ‌ద‌ర్శి రియాక్ట్ అయ్యారు. ఆయ‌న మాట్లాడుతూ - "ఇడుపు కాయితం ఓపెనింగ్ ఈవెంట్ జ‌రిగిన త‌ర్వాత సోషల్ మీడియాలో సినిమా గురించి చాలా మంది నెగిటివ్ గా స్పందించారు. ఈ సినిమాకు సబ్ టైటిల్స్ వేస్తారా, తెలుగులో డబ్ చేస్తారా అని కామెంట్స్ చేశారు. ఆ టైమ్ లో మేము తప్పు చేస్తున్నామా అని అనిపించిది. ఆ నెగిటివిటీ చూసి బాధకు లోనయ్యాం . నేటివిటీ గురించి ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ఒక్క‌సారి గ‌డ‌ప‌ పాట వినండి. ఆ ప్రేమను ఫీల్ అవుతారు. డిసెంబర్ 11న రిలీజ‌య్యే మా సినిమా ప్రాంతం, భాషా భేదాల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంది" అని  తెలిపారు.

 

Advertisement
Advertisement