Tollywood | పెద్ద సినిమాలకే టికెట్ ధరల పెంపు – తెలంగాణ సర్కార్ కొత్త జీవోపై ప్రొడ్యూసర్ గిల్డ్ రియాక్షన్
టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన కొత్త జీవోపై యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పందించింది. ఈ జీవో చిన్న సినిమాలకు ఎంతో లాభదాయకంగా ఉందని అన్నారు. ఈ జీవోలోని నిబంధనలను గురించి వివరిస్తూ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
Entertainment | Published On Aug 21, 2026, 7.12 pm IST
Tollywood |తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో (GO) తెలుగు సినీ పరిశ్రమను బలోపేతం చేయడానికి, ఇండస్ట్రీ ఎదుగుదలకు తోడ్పాటునందించేలా ఉందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొన్నది.
ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఐమాక్స్ (IMAX), డాల్బీ సినిమా (Dolby Cinema), హెచ్‌డీఆర్ (HDR) వంటి అత్యధునిక సాంకేతికత హంగులతో కూడిన సినిమా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణ పెరిగింది. తెలుగు ఇండస్ట్రీలోని ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం, అర్హత ఉన్న సినిమాల టికెట్ ధరల పెంచుకునేందుకు వీలుగా అవసరమైన విధివిధానాలతో కూడిన జీవోను జారి చేసిందని ప్రొడ్యూసర్ గిల్డ్ పేర్కొన్నది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని ముఖ్యమైన అంశాలు ఇవే...
సినిమా టికెట్ ధరల పెంపు అనేది ప్రతి సినిమాకు వర్తించదు. టికెట్ ధరల పెంపుకోసం అర్హత కలిగిన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ అధికారుల సమీక్ష తర్వాతే పెంపు అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
థియేటర్ ఏసీ, నాన్-ఏసీ, సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అనే సంబంధం సినిమా వినోద మాధ్యమం సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా థియేటర్ మొత్తం సీట్లలో 25% సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి తప్పనిసరిగా కేటాయించాలని ఈ జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది.
ప్రతి రోజు 5 షోలు
ప్రతి రోజు 5 షోలకు అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద సినిమాలకు చిన్న సినిమాలు లాభపడతాయి. స్మాట్, మిడ్ రేంజ్ సినిమాలకు ఎక్కువగా స్క్రీన్లు దొరుకుతాయి. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేలా ప్రత్యేకమైన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం ఈ జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక నిధి...
ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుకు పరిమితం కాకుండా పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా ఆధునిక సాంకేతికతతో సినిమాలను రూపొందించడానికి ప్రోత్సహకంగా ఉంటుందని ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. చిన్న సినిమాలకు ఈ జీవో ఎంతో లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు.
టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన కొత్త జీవోపై యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పందించింది. ఈ జీవో చిన్న సినిమాలకు ఎంతో లాభదాయకంగా ఉందని అన్నారు. ఈ జీవోలోని నిబంధనలను గురించి వివరిస్తూ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
తాజావార్తలు
- ●Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా
- ●Telangana Congress | అసమ్మతి జ్వాల
- ●Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి.. వైరల్
- ●Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!
- ●OpenAI | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజెస్ యాప్లో ఇక చాట్ జీపీటీ..
- ●Uttam Kumar Reddy | ప్రతి రూపాయి రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో చేరాలి

Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా

Telangana Congress | అసమ్మతి జ్వాల

Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి.. వైరల్

Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!



