త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLAs Disqualification | గ‌డువులోగా పూర్తి చేయ‌క‌పోతే స్పీక‌ర్‌పై కోర్టు ధిక్కార చ‌ర్య‌లు

MLAs Disqualification | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) త‌ర‌పున గెలిచి, కాంగ్రెస్ (Congress) పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల (MLAs Disqualification) విచార‌ణ‌ను గ‌డువులోగా పూర్తి చేయ‌క‌పోతే కోర్టు ధిక్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు అల్టిమేటం జారీ చేసింది.

A

Telangana | Published On Feb 6, 2026, 1.32 pm IST

MLAs Disqualification | గ‌డువులోగా పూర్తి చేయ‌క‌పోతే స్పీక‌ర్‌పై కోర్టు ధిక్కార చ‌ర్య‌లు
Advertisement

ఫిరాయింపుల కేసులో సుప్రీం అల్టిమేటం
చివ‌రి అవ‌కాశంగా మూడు వారాల గ‌డువు

MLAs Disqualification | త్రినేత్ర‌.న్యూస్‌ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) త‌ర‌పున గెలిచి, కాంగ్రెస్ (Congress) పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల (MLAs Disqualification) విచార‌ణ‌ను గ‌డువులోగా పూర్తి చేయ‌క‌పోతే కోర్టు ధిక్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు అల్టిమేటం జారీ చేసింది. కేసును మూడు వారాల వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచార‌ణ చేప‌ట్టిన జ‌స్టిస్ సంజ‌య్ క‌రోల్‌, జ‌స్టిస్ అగ‌స్టీన్ జార్జ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్పీక‌ర్‌కు చివ‌రి అవ‌కాశంగా మూడు వారాల గ‌డువు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌ని బీఆర్ఎస్ త‌ర‌పున వాద‌న‌లను న్యాయ‌వాది మోహిత్‌రావు వినిపించారు. ఇప్ప‌టికే స్పీక‌ర్‌కు మూడుసార్లు స‌మ‌యం ఇచ్చార‌ని ధ‌ర్మాస‌నానికి గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో గెలిచి, ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్య‌క్తి ఆరు నెల‌ల్లోనే ఎంపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేశార‌ని, ఓడిపోయాక ఇప్పుడు మ‌ళ్లీ బీఆర్ఎస్ అంటున్నార‌ని చెప్పారు. మ‌రో ఎమ్మెల్యే కూతురు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచింద‌ని, తండ్రి ఆమెతోనే ఉన్నార‌ని వివ‌రించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున వాదిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాదులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, ముకుల్ రోహిత్గీ వాద‌న‌లు వినిపిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరుపుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. విచార‌ణ‌కు మ‌రో మూడు వారాల స‌మ‌యం కోరారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఎనిమిది మంది పిటిష‌న్ల‌పై తీర్పు ఇచ్చార‌ని గుర్తు చేశారు. వాద‌న‌లు పూర్తైన అనంత‌రం ధ‌ర్మాస‌నం స్పీక‌ర్‌కు చివ‌రి అవ‌కాశంగా మూడు వారాల గ‌డువు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ, త‌దుప‌రి విచార‌ణ‌ను మూడు వారాల‌కు వాయిదా వేసింది.

Advertisement
Advertisement