Municipal Elections | హాలియాలో బీఆర్ఎస్ విజయం ఆసక్తికరం.. అసలేం జరిగిందంటే?
Municipal Elections | అప్పటివరకు వారిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. కలిసి తిరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఒకరు నామినేషన్ వేశారు. ఎందుకైన మంచిదని తనతోపాటు తిరిగిన వ్యక్తితోనూ నామినేషన్ వేయించాడు. టికెట్ వచ్చినవారే పోటీచేయాలనే షరతుపై.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: అప్పటివరకు వారిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. కలిసి తిరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఒకరు నామినేషన్ వేశారు. ఎందుకైన మంచిదని తనతోపాటు తిరిగిన వ్యక్తితోనూ నామినేషన్ వేయించాడు. టికెట్ వచ్చినవారే పోటీచేయాలనే షరతుపై. అయితే పార్టీ టికెట్ వచ్చిన వ్యక్తి ఓడిపోగా, బరిలోనే కొనసాగిన మరో వ్యక్తి గెలుపొందాడు. అందుకేనేమో.. తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచిందంటారు..!
హాలియా మున్సిపాలిటీలోని (Haliya Municipality) 4వ వార్డు మినహా మిగిలిన 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ఒక్కస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఈ విజయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన కడమంచి ప్రమీల భర్త శ్రీనివాస్ మున్సిపల్ ఎన్నికల వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుడు మందా నర్సిరెడ్డి తన భార్య విజయలక్ష్మి పేరున నామినేషన్ వేశారు. ఎందుకైనా మంచిదని తనతో పాటు ఉండే శ్రీనివాస్ (భార్య ప్రమీల)తో కూడా నామినేషన్ వేయించారు. కాంగ్రెస్ బీ ఫామ్ ఎవరికి ఇస్తే వారు పోటీలో ఉండాలని, మిగిలినవారు వారు నామినేషన్ ఉపసంహరించుకోవాలని అనుకున్నారు. అయితే పార్టీ టిక్కెట్ విజయలక్ష్మికి దక్కింది.
కాగా, అప్పటికే తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నానని విస్తృతంగా ప్రచారం చేసుకున్న శ్రీనివాస్.. వెనక్కి తగ్గలేద. తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో శ్రీనివాస్ భార్య ప్రమీలకే బీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్‌ను వీడినప్పటికీ శ్రీనివాస్ తన పంతం నెగ్గించుకోవడంపై మున్సిపాలిటీలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



