త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | రోడ్ల‌పై రాజ‌కీయాలు చేస్తామంటే ఊరుకోం.. హ‌రీశ్‌రావుపై మ‌ల్లు ర‌వి ఫైర్

Mallu Ravi | చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ రోడ్లపై రాజకీయాలు చేస్తాం అంటే ప్రభుత్వం ఊరుకోదని, చట్టం తన పరిధిలో పని చేస్తుంది అని హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Apr 8, 2026, 3.31 pm IST

Mallu Ravi | రోడ్ల‌పై రాజ‌కీయాలు చేస్తామంటే ఊరుకోం.. హ‌రీశ్‌రావుపై మ‌ల్లు ర‌వి ఫైర్
Advertisement

Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్ : చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ రోడ్లపై రాజకీయాలు చేస్తాం అంటే ప్రభుత్వం ఊరుకోదని, చట్టం తన పరిధిలో పని చేస్తుంది అని హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి ధ్వ‌జ‌మెత్తారు. రాజకీయ లబ్ది కోసం హరీశ్‌రావు రోజుకొక డ్రామా చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అబద్దాల పునాదులపై రాజకీయాలు చేస్తూ పూట గడుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల నేతృత్వంలోని ప్రజా పాలన ఈ రెండున్నరేళ్ల‌ల్లో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇచ్చిన హామీల అమలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా చేసి చూపెట్టామ‌ని మ‌ల్లు ర‌వి తెలిపారు.

మీ బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదేళ్లు ఎంత నిర్బంధం అమలు చేశారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వళ్లించినట్టు అక్రమ అరెస్టులు, నిర్బంధం అని మాట్లాడితే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది. ఒక చిన్న నిరసన కార్యక్రమాలు ఇస్తే చిన్న మండల నాయకుడి నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు అందరిని గృహ నిర్బంధం చేసిన చరిత్ర మీది. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరామ్‌ని అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి అక్రమ అరెస్టులు చేశారు. లేని కేసులు పెట్టి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి బెడ్ రూమ్‌లో నుంచి లాక్కెళ్లారు. అవన్నీ నిర్బంధాలు కావా.. అసలు ఇప్పుడు నిర్బంధాలు ఉన్నాయా.. ఉంటే మీరు బయటకు వ‌చ్చేవారా..? మేము అత్యంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పాలన చేస్తున్నాం. ప్రజలు మీ పాలన.. మా పాలన రెండు చూస్తున్నారు.. వాళ్లే నిర్ణయిస్తారు అని మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు.

Advertisement
Advertisement