త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Yennam Srinivas Reddy | అలా చేస్తేనే మీరు అధికారంలోకి వ‌స్తారు..! కేసీఆర్‌కు యెన్నం సూచ‌న‌..!!

MLA Yennam Srinivas Reddy | అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికైన కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే కేసీఆర్ అధికారంలోకి వ‌స్తార‌ని ఎమ్మెల్యే యెన్నం జోస్యం చెప్పారు.

S

Telangana | Published On Feb 18, 2026, 8.17 pm IST

MLA Yennam Srinivas Reddy | అలా చేస్తేనే మీరు అధికారంలోకి వ‌స్తారు..! కేసీఆర్‌కు యెన్నం సూచ‌న‌..!!
Advertisement

MLA Yennam Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికైన కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే కేసీఆర్ అధికారంలోకి వ‌స్తార‌ని ఎమ్మెల్యే యెన్నం జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసిండు కాబట్టి ముఖ్యమంత్రి అయిండని ఆయ‌న పేర్కొన్నారు. మీటింగ్‌లో తిట్టి, సోషల్ మీడియాలో ఫోక‌స్ అయితే అధికారంలోకి రారని ఎమ్మెల్యే యెన్నం విమ‌ర్శించారు.

కేటిఆర్ ఎన్ని ప్రగల్బాలు పలికిన ప్రజలు నమ్మరు. కేటీఆర్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అనుకోవ‌ట్లేదు. కేసీఆర్ స్థానానికి కేటీఆర్ సరిపోడు. కేసీఆర్, కేటిఆర్‌ను గ్రామీణ ప్రజలు ఆదరించలేదు. చివ‌ర‌కు అర్బన్ ఓటర్లు కూడా ఆదరించలేదు. మీరు కలలు కంటున్న అధికారం ఎప్పటికీ రాదు. కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వీడితేనే అధికారంలోకి వ‌స్తార‌ని ఎమ్మెల్యే యెన్నం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలన విధానంతో పాటు రైతుల‌ను, మ‌హిళ‌ల‌ను మెప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 60శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. జనరల్ స్థానంలో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చాం. జనరల్ స్థానంలో ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. సోషల్ జస్టిస్ ప్రకారం మేము ముందుకు పోయాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి సపోర్ట్ చేశారు. తెలంగాణలో స్వచ్ఛమైన పాలనకు నిదర్శనం పాలమూరు కార్పొరేషన్ ఎన్నిక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement