MLA Balu Naik | గవర్నర్ ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం : ఎమ్మెల్యే బాలు నాయక్
MLA Balu Naik | గవర్నర్ ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ రోడ్ మ్యాప్‌గా చూడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
MLA Balu Naik | త్రినేత్ర.న్యూస్ : గవర్నర్ ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ రోడ్ మ్యాప్‌గా చూడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఆయన సభలో ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన తీరును అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉందని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా, తెలంగాణ ప్రజలు నమ్మకంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఈ రెండేండ్లలో మరి అనేకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గవర్నర్ ప్రసంగంలో ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది అని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.
తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రెండేండ్లలోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టింది. గవర్నర్ ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టింది. అదే విధంగా తెలంగాణ రోడ్ మ్యాప్‌గా చూడాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైన భూమిక పోషిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డటువంటి సందర్భంలో తొలి పదేండ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విద్వంసంతో పాటు నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని చూశాం. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మగౌరవంతో జీవించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు సుమారుగా 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చాం. అదే విధంగా పేదవారి కోసం గ్రామాల్లో వారి ఇళ్లల్లో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా కడుపేదల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. పేదల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం. గొప్ప మనసున్న ప్రభుత్వం మాది అని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



