MLA Anirudh Reddy | మళ్లీ తిరగబడే రోజులు వస్తాయి.. ఆంధ్రా వ్యాపారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక
MLA Anirudh Reddy | హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా వ్యాపారులకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడితే మళ్లీ తిరగబడే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.
MLA Anirudh Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా వ్యాపారులకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడితే మళ్లీ తిరగబడే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఓ యూట్యూబ్ చానెల్(తెలుగు)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చర్చకు దారి తీసిన ఇప్ప సారా, డ్రగ్ టెస్టులతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన సదరు జర్నలిస్టు.. ఇటీవల లోక్‌సభలో టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 18ని బ్లాక్ డేగా పరిగణించారని గుర్తు చేశారు. దీనిపై మీరు ఏమంటారు అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
తెలంగాణ బిల్లు పాసైన రోజును బ్లాక్ డేగా పరిగణిస్తే.. హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నారు. ఇక్కడ ఇల్లు ఉంటే విడిచిపెట్టి వెళ్లిపొమ్మనండి. ఆయనకున్న కాలేజీలకు ఎవర్నీ పోవద్దని కూడా చెబుతాం. తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారికి హైదరాబాద్‌లో స్థానం లేదు. ఇక ఏమన్న అంటే.. మేం ఇండియాలో ఎక్కడైనా ఉంటామని అంటరు. ఎక్కడైతే సంపాదిస్తారో.. ఎక్కడైతో తింటారో ఆ ప్రాంతాన్ని అవమానించకండి. మరి హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారు..? ఎందుకోసం ఉంటున్నారు..? అని అనిరుధ్ రెడ్డి నిలదీశారు.
అంతా ఆంధ్రా వాళ్లవే.. లక్షల కోట్ల బిజినెస్..
తెలంగాణ వాళ్లకు ప్రయివేటు స్కూల్స్ లేవు. అంతా ఆంధ్రా వాళ్లవే.. లక్షల కోట్ల బిజినెస్.. మేం ఫోన్ చేసి అడిగితే ఒక్క రూపాయి కూడా తగ్గించరు. చిన్నచూపు చూస్తున్నారు. ఏదో ఒక రోజు టైమ్ వస్తది.. పిల్లలందర్నీ గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివిపిస్తాం. వారు కమర్షియల్ .. ఎందుకు ఇక్కడ..? వెళ్లిపో ఇక్కడ్నుంచి.. స్కూల్ కూడా బంద్ చేయ్ బ్లాక్ డే కదా..! బిజినెస్‌లు చేసుకుంటావ్. పైసలు సంపాదించుకుంటవ్. ఇల్లు ఇక్కడే ఉంటుంది కానీ తినే కంచంలో మళ్లా మట్టి వేస్తావు. ఇలాంటి వాళ్లను నమ్మొద్దు.. కమర్షియల్ విద్యాసంస్థలు ఉండొద్దు.. వీటిపై సీఎం వేటు వేస్తారు. యంగ్ ఇండియా స్కూల్స్ అందుబాటులోకి వస్తే.. ప్రయివేటుకు విద్యాసంస్థలకు ఏ విద్యార్థి కూడా వెళ్లరు అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
పైసలకు అమ్ముడుపోం.. మేం సెంటిమెంట్ ప్రజలం..
మా తెలంగాణ ప్రజలు ఎవర్నీ అనుకుంటే వాళ్లను గెలిపిస్తరు. ఆంధ్రోళ్లు గెలిపించే స్థితిలో మేం లేము. పైసలకు అమ్ముడుపోం. మేం సెంటిమెంట్ ప్రజలం. డబ్బుల సంచులు ఉంటే వారి ఇంట్లో పెట్టుకోమనండి.. డబ్బులు సంచులకు ప్రభావితమైతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేదే కాదు. నాడు లీడర్లను కొనాలని యత్నించారు. తెలంగాణ వచ్చింది.. హ్యాపీగా ఉన్నాం. మీరు ఇంకా స్టేట్‌మెంట్లు.. బ్లాక్ డే అని మాట్లాడితే మళ్లీ తిరగబడే రోజులు వస్తాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




