Jeevan Reddy | మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. దవాఖానలో చికిత్స
Jeevan Reddy | మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానకు తరలించారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానకు తరలించారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వెంటనే హాస్పిటల్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆయనకు పాయిజన్ (Food Poisoning) అయినట్లు చెప్పారు. జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి విషయాలు వెళ్లడించలేదు.
కాగా, గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన జీవన్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. దీంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. క్రమంగా పార్టీలో ఆయన ప్రాధాన్యమూ తగ్గుతూ వచ్చింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్‌రెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తనతోపాటు, తన మద్దతుదారులకు పార్టీలో గుర్తింపు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ అధిష్ఠానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో తన మద్దతుదారులను 14న మందిని కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే వర్గానికే చైర్మన్ పదవి, జీవన్‌రెడ్డి వర్గానికి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చి.. ఆయనను బుజ్జగించింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురవడం గమనార్హం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




