త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | రాజ‌గోపాల్‌రెడ్డిని వ‌దిలేద్దామ‌ని నేను అన‌లే

Revanth Reddy | మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy), మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao)పై సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Nov 23, 2026, 8.16 pm IST

Revanth Reddy | రాజ‌గోపాల్‌రెడ్డిని వ‌దిలేద్దామ‌ని నేను అన‌లే
Advertisement
  • సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావుకు చుక్క‌లు చూపిస్తా
  • మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy), మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao)పై సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎల్ల‌మ్మ గుడి ద‌గ్గ‌ర ప్ర‌మాణం చేయ‌మ‌ని హ‌రీశ్‌రావుకు స‌వాల్ చేస్తే డాన్స్ చేసిండ‌ని.. కానీ ప్ర‌మాణం మాత్రం చేయ‌లేద‌న్నారు. వాళ్ల మామ కేసీఆర్‌కు కామారెడ్డిలో చుక్క‌లు చూపించాన‌ని గుర్తు చేశారు. సోమ‌వారం మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి వదిలేద్దామని నేను అనలేదు. ఎల్లమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయమని హరీష్ రావు కు సవాల్ విసిరిన. ఎల్లమ్మ దగ్గరికి పోయి సదర్ డాన్స్ చేసిండు గాని ప్రమాణం చేయలేదు. వాళ్ల మామ కేసీఆర్ కు కామారెడ్డిలో చుక్కలు చూపించినా. హరీష్ రావుకు కూడా సిద్దిపేటలో చుక్క‌లు చూపిస్తా అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement