CM Revanth Reddy | మెడికల్ టూరిజానికి కేంద్రంగా హైదరాబాద్ : సీఎం రేవంత్
Revanth Reddy | హైదరాబాద్‌లో జరిగిన అపోలో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | హైదరాబాద్‌లో జరిగిన అపోలో ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అపోలో ఆస్పత్రుల స్థాపకుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డిని ఆయన ప్రశంసిస్తూ దేశంలో అనేక ఆస్పత్రుల స్థాపనకు అపోలో యాజమాన్యం మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. 46 సంవత్సరాల క్రితం చెన్నైలో తొలి అపోలో ఆస్పత్రి ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసిన సీఎం, అపోలో సంస్థ పేరు కోట్లాది మంది ప్రజల గుండెల్లో భరోసా కలిగించే చిహ్నంగా మారిందని అన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న అపోలో యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రానికి విజ్ఞప్తి చేశాం..
హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం వెల్లడించారు. వైద్య సేవల కోసం వెస్ట్ ఆసియా దేశాల నుంచి నేరుగా విమానాలు హైదరాబాద్‌కు వచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య నగరాన్ని నాలుగో నగరంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రీన్ ఛానల్ వ్యవస్థ ద్వారా రోగులను ఆస్పత్రులకు త్వరగా తరలించే విధంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్ నుంచే కొవిడ్ వ్యాక్సిన్లు..
కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అయిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను ‘సోషల్ డాక్టర్’గా అభివర్ణించిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలకు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని, వ్యాపారాలు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



