CM Revanth Reddy | కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టని భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టని భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం పర్యటించారు. మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు.
CM Revanth Reddy | కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టని భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం పర్యటించారు. మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు సంబంధించిన సాంకేతిక నిపుణులతో కలిసి పరిశీలించామన్నారు. ఒక అవగాహన కల్పించుకొని.. ఎన్‌డీఎస్ఏ, ఇతర సాంకేతిక సంస్థలు, సాగునీటి పారుదలశాఖ అధికారులు మూడు బారేజీలు నిర్మించిన సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను సమావేశానికి తీసుకురావడం జరిగిందన్నారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అవినీతికి తెర
ఈ అంశంలో లోతులోకి వెళ్లడం లేదని, గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని 1975లో జలగం వెంగళ్రావ్ ఆ నాటి ముఖ్యమంత్రి చవాన్‌తో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ జరిగిందని, వివిధ కారణాలతో నిర్మాణం జరుగని ప్రాజెక్టును వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని సాంకేతిక అనుమతులతో పాటు టెండర్ పనులన్నీ పూర్తి చేసి 2009లో పనులను ప్రారంభించారని తెలిపారు. ఆనాడు రూ.38,500కోట్లతో 16.40లక్షల ఎకరాలకు అదేవిధంగా పరిశ్రమలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులతో 160 టీఎంసీలతో పనులను ప్రారంభించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు రూ.6,158 కోట్లు ఖర్చు చేశారన్నారు. తెలంగాణ వచ్చాక రూ.5వేలకోట్లకుపైగా ఖర్చు చేశారన్నారు.
ప్రాణహిత-చేవేళ్లపై రూ.11వేలకోట్లకుపైగా ఖర్చు..
ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలో రూ.11,711కోట్ల ఖర్చు చేశాక చంద్రశేఖరర్‌రావు మదిలో దీనివల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదుకాబట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుమీద ఈ అంకానికి, అవినీతి, ఆలోచనకు తెరలేపిందని ఆరోపించారు. పేరు, ఊరు, అంచనాలను మార్చిండు. దాంతో గత ఆనవాళ్లను లేకుండా చేయడం ద్వారా ప్రాణహిత, చేవెళ్ల పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని, తుమ్ముడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు మార్చారు. రూ.30వేలకోట్లుగా ఉన్న అంచనాలను దాదాపుగా రూ.1.50లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. తద్వారా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలతో పాటు తనకుతాను ప్రచారం కల్పించుకునేందుకు అనేక రకాల తప్పిదాలు చేశారన్నారు. దాంతో 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తి చేశామని ప్రారంభించారని, ఆ రోజు ప్రపంచంలోనే ఒక అద్భుతం, ఇది ఎవరూ కట్టలేదని ప్రచారం కల్పించుకోవడంతో పాటు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్దాలను చెప్పి, వారే ఇక్కడకు వచ్చి.. ఇది కాళేశ్వరం కాదని, హరీశ్‌రావు పేరు హరీశ్‌రావు కాదు కాళేశ్వర్‌రావు అని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంజినీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదు..
ఆనాడు జరిగిన పనులన్నింటిని చూసి ఇది అద్భుతమైన కట్టడమని ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని, 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ ఆరోపించారు. 2020లోనే ఈ మేడిగడ్డ బరాజ్‌లో లీక్‌లో ఉన్నాయని, నిర్మాణాల్లో లోపం ఉందని ఆనాటి ఇంజినీర్లు ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాసిన పట్టించుకోలేదని, చివరకు 2023 అక్టోబర్-నవంబర్‌లో పూర్తిగా మేడిగడ్డ కూలిపోయిందన్నారు. ఆ తెల్లారే ఇంజినీర్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేశారని, అన్నీ దాచి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ అవినీతి, అహంకారాన్ని గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచినా, మూసినా బయటకు తీసుకువచ్చిందన్నారు. ఆ రోజు నాతో పాటు శ్రీధర్‌బాబు, రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటనకు వచ్చి ఇక్కడి అంశాలను ప్రపంచానికి తెలియజెప్పడం జరిగిందన్నారు. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టుల్లో సమస్యలు రాంగనే ఎన్‌డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ ఒకటిన ప్రాథమిక నివేదిక ఇచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలున్నాయని చెప్పిందని, దీన్ని పూర్తిస్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకెళ్తాం, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం ప్రమాదకరమని ఎన్‌డీఎస్ఏ తొలి నివేదిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిందని చెప్పారు. అప్పుడు ఎదురుదాడి చేశారే తప్ప తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేయలేదని, ఆ తర్వాత విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్‌డీఎస్ఏ పూర్తి నివేదిక ఇచ్చిందని వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



