త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మీ ఏడుపు.. నా చెవుల‌కు సంగీతం : సీఎం రేవంత్

CM Revanth Reddy | ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శలు గుప్పించారు. మీరు ఏడ్చుకుంటేనే ఉండండి.. నేను చేసుకుంటూ పోత‌నే ఉంటా అని సీఎం అన్నారు. మీ ఏడుపు.. నా చెవుల‌కు సంగీతం వినిపించిన‌ట్టుగా ఉంటద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

S

Telangana | Published On Apr 28, 2026, 7.39 pm IST

CM Revanth Reddy | మీ ఏడుపు.. నా చెవుల‌కు సంగీతం : సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శలు గుప్పించారు. మీరు ఏడ్చుకుంటేనే ఉండండి.. నేను చేసుకుంటూ పోత‌నే ఉంటా అని సీఎం అన్నారు. మీ ఏడుపు.. నా చెవుల‌కు సంగీతం వినిపించిన‌ట్టుగా ఉంటద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.

ఫ్యూచ‌ర్ సిటీ న‌చ్చ‌నోళ్ల‌కు క‌డుపులో నొప్పి ఉండొచ్చు. ఫ్యూచ‌ర్ లేని నాయ‌కుడు.. ఫ్యూచ‌ర్ సిటీ క‌డుత‌డంటా అని అంటున్న‌రు. మీరు ఏడ్చుకుంటేనే ఉండండి.. నేను చేసుకుంటూ పోత‌నే ఉంటా. మీ ఏడుపే.. మీ ఆర్త‌నాదాలే.. అధికారం పోయింద‌ని కుటుంబమంతా కూర్చొని పెడ‌బొబ్బ‌లు పెట్టి ఏడుస్తుంటే నా చెవులకు సంగీతం వినిపించిన‌ట్టుగా ఉంట‌ది. శంకారాభ‌ర‌ణం సినిమా చూసిన‌ట్టు ఉంట‌ది వారి ఏడుపులు వింటుంటే. పోయినోడికి స‌హ‌జంగానే ఏడుపు ఉంట‌ది అని రేవంత్ విమ‌ర్శించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం.. అభివృద్ధి చేస్తున్న క్ర‌మంలో ఒక‌ట్రెండు త‌ప్పులు దొర్లుతుంటాయి. మూసీ న‌ది పున‌ర్‌ నిర్మాణం, రీజిన‌ల్ రింగ్ రోడ్డు, భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, మెట్రో రైల్ నిర్మాణం కావొచ్చు.. వేగంగా చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఎక్క‌డైనా చిన్న త‌ప్పులు దొర్లితే.. అది ఉద్దేశ‌పూర్వ‌కంగా, మీకు ఇబ్బంది క‌లిగించాల‌న్న ఆలోచ‌న కానేకాదు. స‌రిదిద్దేందుకు నేను ఉన్నాను. న‌మ్మ‌కంతో ముందుకు న‌డ‌వండి ఆ న‌మ్మ‌క‌మే అభివృద్ది వైపు న‌డిపిస్తుంది. పోలీసు క‌మిష‌న‌రేట్ ఇక్క‌డికి వ‌చ్చిందంటే ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సంపూర్ణ‌మైన విశ్వాసం, న‌మ్మ‌కం క‌లుగుతుంది. ఈ న‌గ‌రాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement