త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నువ్వెంత‌.. నీ జాతి ఎంత‌..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వెంత‌.. నీ జాతి ఎంత‌..? అని సీఎం మండిప‌డ్డారు. నీ దోపిడీని తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రిచిపోయే ప్ర‌స‌క్తే లేద‌ని సీఎం పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 18, 2026, 8.05 pm IST

CM Revanth Reddy | నువ్వెంత‌.. నీ జాతి ఎంత‌..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వెంత‌.. నీ జాతి ఎంత‌..? అని సీఎం మండిప‌డ్డారు. నీ దోపిడీని తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రిచిపోయే ప్ర‌స‌క్తే లేద‌ని సీఎం పేర్కొన్నారు. అందెశ్రీ స్మృతి వ‌నానికి భూమిపూజ సంద‌ర్భంగా రేవంత్ ప్ర‌సంగించారు.

మా స్ఫూర్తి గ‌ద్ద‌ర్, అందెశ్రీ, సోనియా.. నీ స్ఫూర్తి నిజామా..? ఖాసీం రిజ్వీనా..? ఈడీ అమీనా..? ఎవ‌డు నీస్ఫూర్తి.. ఏ జాతీ నీది..? నీ నీతి ఏంది..? నీకు మాకు పోలికేంది..? పోటీ ఏంది..? మేం లేన‌ప్పుడు తెలంగాణలో దోపిడీకి పాల్ప‌డ్డావు. ఈ దోపిడీని మ‌రిచిపోతామా..? అని రేవంత్ రెచ్చిపోయారు.

బిడ్డా బిచ్చ‌మెత్తుకుని బ‌త‌కాల్సి వ‌స్త‌ది..

రెండు త‌రాల ముందు నిజాం న‌వాబు, ఖాసీం రిజ్వీ ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల్లో మొద‌టి రెండుస్థానాల్లో ఉండే. స‌రిగ్గా రెండు త‌రాల త‌ర్వాత ఓ పారిశ్రామివేత్త రాణించిన త‌ర్వాత‌.. నిజాం కుటుంబాన్ని కలుద్దామ‌ని ప్ర‌య‌త్నించిండు. అప్ప‌టికే నిజాం కుటుంబానికి దిక్కులేని ప‌రిస్థితి ప‌ట్టింది. నీ కుటుంబానికి ఎంత..? ఈక‌లోనిది తోక‌లోనిది.. ఇవాళ నీవు అనుకుంటున్న‌వేమో చాలా ఉంట‌ద‌ని. ఏది ఉండ‌దు బిడ్డా బిచ్చ‌మెత్తుకుని బ‌త‌కాల్సి వ‌స్త‌ది.. నిజాం లాంటోడే మూడో త‌రానికి దొర‌క‌ని ప‌రిస్థితి ఈ ప్రాంతంలో ఉత్ప‌న్నమైంది అని రేవంత్ గుర్తు చేశారు.

తెలంగాణ స‌మాజం ఎడ్డిదోగుడ్డిదో కాదు

నువ్వెంతా.. నీ జాతి ఎంత‌.. నీ జాతి ఈ ప్ర‌జాపాల‌న మీద శాప‌నార్థాలు పెడుతాదా. చ‌ర్చ‌కు రావు.. చేత‌కాదు. అసెంబ్లీకి ర‌మ్మంటే ఇంట్లో ప‌డుకుంటవ్.. కుట్ర‌లు కుతంతాలు. తెలంగాణ స‌మాజం ఎడ్డిదోగుడ్డిదో కాదు. చైత‌న్య‌వంత‌మైన స‌మాజం. నిజాంను కూడా సాయుధ రైతాంతంగా పోరాటం ద్వారా మ‌ట్టి క‌రిపించి చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. నువ్వెంతా.. ప‌దేండ్లు సీఎంగా ఉంటే నిజాం కంటే గొప్పోడివి అనుకుంటే తెలంగాణ స‌మాజం క్ష‌మిస్త‌దా..? అందెశ్రీ, గ‌ద్ద‌ర‌న్న‌నే మాకు స్ఫూర్తి. మా ప్ర‌జాపాల‌న‌లో వారి స్ఫూర్తి ఉంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement