త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడుకు విష‌యంలో బండి సంజ‌య్ తీరు నైతికంగా త‌ప్పే : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy |  కొడుకు విష‌యంలో కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ తీరు నైతికంగా త‌ప్పేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయ‌న వే టూ న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడారు. రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన భ‌గీర‌థ్ పోక్సో కేసుపై ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేశారు.

P

Telangana | Published On May 15, 2026, 7.56 pm IST

CM Revanth Reddy | కొడుకు విష‌యంలో బండి సంజ‌య్ తీరు నైతికంగా త‌ప్పే : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy |  కొడుకు విష‌యంలో కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ తీరు నైతికంగా త‌ప్పేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయ‌న వే టూ న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడారు. రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన భ‌గీర‌థ్ పోక్సో కేసుపై ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ నెల 8న రాత్రి మైన‌ర్ బాలిక త‌ల్లి పేట్ బ‌షీరాబాద్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశార‌న్నారు. 9న విచార‌ణ ప్రారంభించి సెక్ష‌న్లు కూడా మార్చి కేసు పెట్టిన‌ట్లు తెలిపారు. ప్ర‌ధాని మోదీ టూర్‌లో మొత్తం ప‌ది కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యార‌ని, ఆయ‌న భ‌ద్ర‌త కోసం 10వేల మంది పోలీసులు ప‌ని చేశార‌న్నారు. 11న సెక్ష‌న్లు స‌వ‌రించి వెంట‌నే నోటీసులు జారీ చేశామ‌న్నారు. భ‌గీర‌థ్ సైతం క‌రీంన‌గ‌ర్‌లో ఫిర్యాదు చేశాడ‌ని, ఫిర్యాదుల‌ను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్‌మెంట్‌ని తీసుకొని నోటీసులు ఇచ్చార‌న్నారు. తొందరపడితే 1000 మంది పోలీసుల‌ను తీసుకుని ఇంటి మీద పడ్డారని అంతా విమ‌ర్శ‌లు చేసేవార‌న్నారు.

ఎవ‌రికీ మిన‌హాయింపు లేవు

సినిమా వాళ్లు, రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా మిన‌హాయింపులు లేవ‌ని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. మైన‌ర్ బాలిక కేసులో ఎట్ల ప‌డితే ఎలా చేయ‌డానికి వీలులేదని, తాను స‌హాయం చేయాలంటే ఫోక్సో కేసు పెట్టం కదా?.. ఫోక్సో కేసు పెట్టామంటేనే నా క‌మిట్మెంట్ ఏమిటో తెలుస్తుంది క‌దా? అంటూ ప్ర‌శ్నించారు. హోంమంత్రి గానే కాకుండా ముఖ్య‌మంత్రిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌న బాధ్య‌త‌న్నారు. ఐదు టీంలు ప‌ని చేస్తున్నామ‌ని, బండి సంజ‌య్ ఇంటికి పోలీసులు నోటీసులు ఇవ్వ‌డానికి వెళ్లార‌ని, ఆయ‌న బావ‌మ‌రిది ఇంటికి వెళ్లారన్నారు. బండి సంజ‌య్‌కి, బీఆర్ఎస్ మ‌ధ్య ఎక్క‌డ చెడిందో నాకు తెలియ‌ద‌న్నారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్పుడు ఆఫీస‌ర్ కాద‌ని.. ఫోక్సో కేసు పెడితే బెదిరించిన‌ట్లా లేక బాధితురాలి ప‌క్షాన ఉన్న‌ట్లా అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్, బండి సంజ‌య్‌కి మ‌ధ్య ఏముందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కేసులో చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష ఉంటుంద‌న్నారు. పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన అంశం.. ఏ చిన్న త‌ప్పు చేసినా పిల్ల‌ల జీవితాలు నాశ‌నమ‌వుతాయ‌న్నారు.

పోలీసులే విచారించాలి..

అమ్మాయికి రెండు బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ ఉన్నాంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందిస్తూ.. వాటిని అన్నింటిని పోలీసులు విచారించాలి క‌దా అంటూ ప్ర‌శ్నించారు. ఒక రోజు ఆల‌స్యమైనా శిక్ష నుంచి త‌ప్పించుకోలేర‌న్నారు. త‌న‌ను జైలులో పెట్టిన కేసీఆర్ కుటుంబంతో తాను క‌ఠినంగా వ్య‌వ‌హారించానా? అంటూ ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ విలీనాన్ని బండి సంజ‌య్ వ్య‌తిరేకించాడ‌ని కోప‌మా? త‌ఆను స‌త్రం న‌డ‌ప‌డం లేదు.. ప్ర‌భుత్వాన్ని న‌డుపుతుమ‌న్నారు. 100శాతం బాధితుల‌కు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని, త‌ప్పు చేసిన వారిని శిక్షిస్తామ‌న్నారు. డిసెంబ‌ర్‌కు ముందే జ‌రిగిన ఘ‌ట‌న‌పైనే ఫిర్యాదు వ‌చ్చిందని, నాలుగు నెల‌లు వెన‌క్కి వెళ్లి అప్ప‌టి ఘ‌ట‌న‌ల‌ను విచారించాలంటే స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

ధైర్యంగా కేసును ఎదుర్కోవాలి..

కుమారుడు విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా త‌ప్ప‌ని సీఎం వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ ధైర్యంగా కేసును ఎదుర్కోవాల‌ని, కొడుకు త‌ప్పిదంతో త‌ల‌వంపులు వ‌చ్చాయ‌న్నారు. బండి సంజ‌య్ నిల‌బ‌డి స‌మాధానం చెప్పాల‌ని, కొడుకును తీసుకువ‌చ్చి బండి సంజ‌య్ స్టేష‌న్‌లో అప్ప‌గించాల‌ని సూచించారు. విచార‌ణ‌ను ఎదుర్కొని నిల‌బ‌డాల‌ని, పారిపోవ‌ద్ద‌న్నారు. నోటీసు స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే పోలీసులు కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement