త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండాల‌ని, ఇందులో రాజీ పడొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెట్ జీరో సిటీ త‌ర‌హాలోనే డిజైన్స్ ఉండాల‌న్నారు.

S

Telangana | Published On May 20, 2026, 4.52 pm IST

CM Revanth Reddy | అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

నెట్ జీరో సిటీ త‌ర‌హాలోనే డిజైన్స్ ఉండాలి
మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో రాజీ ప‌డొద్దు
సివిల్ స‌ర్వీసెస్ అధికారుల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు 500 ఎక‌రాలు
ఫ్యూచ‌ర్ సిటీలో హెల్త్ క‌స్ట‌ర్.. మోదీకి విజ్ఞ‌ప్తి చేద్దాం
ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్ర‌త్యేక సెల్
బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలి..
1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి..
అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండాల‌ని, ఇందులో రాజీ పడొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెట్ జీరో సిటీ త‌ర‌హాలోనే డిజైన్స్ ఉండాల‌న్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్‌మెంట్‌, పరిశ్రమల ఏర్పాటుపైన సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలి. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలి. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలన్నారు.

హెల్త్ క్లస్టర్‌ కోసం మోదీని క‌లుద్దాం..

కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్య లు తీసుకోవాలి. అవసరం అయితే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం. జూన్‌లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలి. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలి అని సూచించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్ర‌త్యేక ఆఫీసు

ఇన్వెస్ట్ తెలంగాణ పేరులో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. దీని కోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్ రూపొందించాలి. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

1500 ఎక‌రాల్లో డేటా సిటీ..

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలి. గ్రూప్-1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలి. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలి. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలి. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి. డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీల‌ను వినియోగించాలి. జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలి. ద్వితీయ శ్రేణి నగరాలల్లో జీసీసీ (Global Capability Centers) ఏర్పాటు పైన దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలి. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్‌కు కనెక్ట్ కావాల్సిందే అని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Advertisement
Advertisement