త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ వేగంగా పూర్తిచేయండి.. ఉమ్మ‌డి పాల‌మూరు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్

Revanth Reddy | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు (PRLIS) సంబంధించిన‌ భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.

G

Telangana | Published On May 19, 2026, 1.17 pm IST

Revanth Reddy | ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ వేగంగా పూర్తిచేయండి.. ఉమ్మ‌డి పాల‌మూరు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు (PRLIS) సంబంధించిన‌ భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైద‌రాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.

జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగ‌తిని జిల్లా మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement