Medaram Jathara | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర - 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర కొనసాగనుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ భారీ వనదేవతల ఉత్సవానికి రాష్ట్రపతి విచ్చేస్తే జాతర వైభవం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపున అధికారికంగా ఆమెను కలిసి జాతర విశిష్టతను వివరించి, ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.