CM Revanth Reddy | ఆ ప్రమాదాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించదు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించదు.. కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించదు.. కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్‌లు అందించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ప్రమాదంలో గాయపడిన ఒకరికి రూ. 3 లక్షల పరిహారం ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం గురించి తెలియగానే సహాయక చర్యలపైన కేంద్రంతో మాట్లాడాను. మంత్రి అజారుద్దీన్‌ను మదీనా పంపించాను. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. నాంపల్లి అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం. అందుకే కుటుంబాలను సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని సీఎం పేర్కొన్నారు.
ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన వద్దు. మీ కష్టం, ఆనందంలో మీతో ఉంటుంది. ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది. అంతా కలిసిమెలిసి ముందుకు వెళ్దాం. కొడంగల్‌లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్‌కు పంపిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
గతేడాది నవంబర్ 17వ తేదీన సౌదీలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాదీలో సజీవదహనమైన విషయం తెలిసిందే.
మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




