CM Revanth Reddy | ‘భట్టి’ కన్నెర్ర జేస్తే ‘బీఆర్ఎస్’ భస్మమైతది.. సీఎం రేవంత్ ఛలోక్తి
CM Revanth Reddy | రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. భట్టి తనకు ఆప్తమిత్రుడని పేర్కొన్న సీఎం.. ఆయన నల్ల అద్దాలు పెట్టుకున్నడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్ర జేస్తే బీఆర్ఎస్ భస్మమైపోతది అని సీఎం రేవంత్ ఛలోక్తి విసిరారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. భట్టి తనకు ఆప్తమిత్రుడని పేర్కొన్న సీఎం.. ఆయన నల్ల అద్దాలు పెట్టుకున్నడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్ర జేస్తే బీఆర్ఎస్ భస్మమైపోతది అని సీఎం రేవంత్ ఛలోక్తి విసిరారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
'భట్టి గారు చిట్టి పంపించిర్రు.. మధిరకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని. ఇగ ఇంత పెద్ద సభ పెట్టినకా ఆయన మాట ఖాళీ చేస్తమ.. ఆయన అడిగింది ఏం లేదు ఒక కాలేజీ. మా పిల్లల చదువుల కోసం. మా దళితులు, గిరిజనులు పేదోళ్ల పిల్లలను ఇంజినీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయ పడుతుండు. ఇంత గొప్ప సభ చేసినకా ఏ నాయకుడైనా కాదంటడ. అసలే ఆర్థిక మంత్రి. ఆయన నల్ల అద్దాలు పెట్టుకున్నడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్ర జేస్తే బీఆర్ఎస్ భస్మమైపోతది. సో మా భట్టి గారు అడిగినట్టు మధిరకు ఇంజినీరింగ్ కాలేజీ ఇస్తున్నాం. మీడియా మిత్రులరా ప్రత్యేకంగా రాయండి' అని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. తదనంతరం ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్ అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని





