త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy fires on KCR | ఎవ‌నికి రా నువ్వు జాతిపిత‌వు.. నీలాంటి లుచ్చా ఎట్ల జాతిపిత ఐత‌డు

మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. "పెళ్లాం మొగుడు ఫోన్లు వినే సన్నాసివి నువ్వు.. సోనియా గాంధీ జాతిపిత అవుతారు కానీ నువ్వెట్లా అవుతావ్?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు.

J

Telangana | Published On Feb 4, 2026, 8.55 pm IST

CM Revanth Reddy fires on KCR | ఎవ‌నికి రా నువ్వు జాతిపిత‌వు.. నీలాంటి లుచ్చా ఎట్ల జాతిపిత ఐత‌డు

సంక్షిప్త సారాంశం

కేసీఆర్‌ను ఉద్దేశించి "నువ్వు జాతిపితవా? నీలాంటి లుచ్చా ఎలా జాతిపిత అవుతాడు?" అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. భార్యాభర్తల ఫోన్లు వినే నీచ సంస్కృతి కేసీఆర్‌దని మండిపడ్డారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో 8 మంది చనిపోతే కేసీఆర్ కుటుంబం దావత్‌లు చేసుకుందని ఆరోపించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే "చింతపండు చేస్తాం" అని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
  • బీఆర్ఎస్‌పై రేవంత్ ఘాటు విమ‌ర్శలు

CM Revanth Reddy fires on KCR | త్రినేత్ర.న్యూస్ : మిర్యాల‌గూడ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ప‌రుష ప‌ద‌జాలంతో వ్యాఖ్య‌లు చేశారు. త‌న స్థాయిని మ‌రిచి... రా... లుచ్చా వంటి వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు మిర్యాల‌గూడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత భాస్క‌ర్ రావు ఒకప్పుడు జానారెడ్డి చెప్పులు మోశాడ‌ని ఇప్పుడాయ‌న‌ను చింత‌పండు చేస్తామ‌ని అన్నారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

CM Revanth Reddy Fierce Attack on KCR in Miryalaguda

  • ఎస్ ఎల్ బీసీ ప్రమాదం జ‌రిగి 8 మంది చ‌చ్చిపోతే..మామ, అల్లుడు, బావ‌, బామ్మ‌ర్ది దావ‌త్‌లు చేసుకొని సంతోష‌ప‌డ్డ‌రు. మ‌నుషులు చచ్చిపోయిండ్రు. ఇక‌ ఎస్ ఎల్ బీసీ కట్టొద్దు..ఆపేయండని సంబ‌రుప‌డ్డ‌రు. క‌డుపుల ఇంత విషం పెట్టుకున్నోడు ఇయాల న‌ల్ల‌గొండ జిల్లాల కౌన్సిల‌ర్ల‌ను గెలిపియ్య‌మ‌ని ఎట్ల అడుగుతడు?
  • సిగ్గు లేకుండ వాళ్లొచ్చినా (బీఆర్ఎస్‌), గంగిరెద్దుల్లాగ ఇంటి ముందుకు వ‌చ్చినా క‌ర్రు కాల్చి వాత పెట్టండి. స‌లాకి ఎర్ర‌గ కాల్చి వీపుల ఎర్ర‌గ వాత‌లు పెట్టండి.
  •  ఏమ‌న్న తెస్తే తీసుకోండి. ఏమ‌న్న ఇచ్చినా తీసుకోండి. సీస‌ల‌ల్ల‌, లాగుల‌ల్ల ఏమ‌న్న ఉంటే అవి కూడా తీస్కోండి. మందిని ముంచిన సొమ్ము మ‌స్తుగున్న‌ది వాళ్ల ద‌గ్గ‌ర. టీఆర్ ఎస్సోడు ఏమిచ్చినా తీసుకోండి. చేయాల్సిన ల‌గ్గం చేయండి.
  •  వీడేమ‌న్న మ‌నిషేనా. మాన‌వ జ‌న్మ ఎత్త‌డానికి అర్హ‌త ఉందా? మంది ఫోన్లు ఇనేటోడు అస‌లు మ‌నిషా? అన్నం తినేటోడు ఎవ‌డ‌న్న పెండ్లాం మొగుడు మాట్లాడుకునేది వింట‌డా? అట్లాంటి స‌న్నాసుల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిండ్రు
  •  ఎవ‌నికి రా నువ్వు జాతిపిత‌వు. ఎవ‌డు నీ జాతి. నీ జాతికి (కులం) నువ్వు పిత‌వు ఉండొచ్చు. మా న‌ల్ల‌గొండ‌కో, మా పాలమూరుకో నీ జాతితోని ఏం ప‌ని? నీ జాతేంది? నీ నీతేంది? పెండ్లాం మొగుడు జోలిపెట్టుకుంటే ఫోన్లు ఇనే స‌న్నాసి నువ్వు జాతిపిత‌వు అంటే..ఎవ‌డ‌న్న ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంట‌డు. బాయిల దుంకి స‌చ్చిపోత‌రు.
    సోనియా గాంధీ జాతిపిత అయిత‌ది త‌ప్ప‌ నీలాంటి దోపిడీ దారుడు, దొంగ‌, లుచ్చా ఎట్ల జాతిపిత అయిత‌డు.
  •  భాస్క‌ర్ రావు (మిర్యాల‌గూడ మాజీ ఎమ్మెల్యే) ఎవ‌డు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్ల నీళ్ల సీస‌లు మోసినోడు కాదా మ‌నోళ్లు నామినేషన్లు వేస్తే భాస్క‌ర్ రావు బెదిరిస్తున్న‌డంట . చింత‌పండైత‌ది భాస్క‌ర్ రావు నీవ‌నుకుంటున్న‌వేమో నీ తెలివితేట‌ల‌న్నీ క‌ట్టిపెట్టు. చింత‌పండైత‌ది. పోత‌వ్ మ‌ల్ల ఖమ్మం. ఇట్ల‌కెల్లి కూడా ఉండ‌వ్‌. నీ వీపులు ప‌లిగేటప్పుడు నీకు సాయంగ ఎవ్వ‌రురారు. భాస్క‌ర్ రావుకు చింత‌పండు కావాల్సిందేన‌ని చెప్పిండ్రు.

CM Revanth Reddy Fierce Attack on KCR in Miryalaguda CM Revanth Reddy Fierce Attack on KCR in Miryalaguda

Advertisement
Advertisement