త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స‌ర్‌పై సమగ్ర అవగాహన అవసరం.. గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

CM Revanth Reddy | స‌ర్ (Special Intensive Revision) అంశంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కారణంగా సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

P

Telangana | Published On May 29, 2026, 10.35 pm IST

CM Revanth Reddy | స‌ర్‌పై సమగ్ర అవగాహన అవసరం.. గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Advertisement

CM Revanth Reddy | స‌ర్ (Special Intensive Revision) అంశంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కారణంగా సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ వల్ల లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో వలసలు ఎక్కువగా జరిగాయని, దీంతో ఓటర్ల జాబితా మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని పేర్కొన్నారు. మహిళలు, దళితులు, మైనార్టీల ఓట్లు కూడా తొలగిపోవచ్చనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యల పరిష్కారంపై పార్టీ నాయకులు పూర్తి అవగాహనతో పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో బూత్ ఎన్రోలర్ల సహాయంతో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ మెంబర్‌షిప్ నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే స్థాయి సమర్థతతో ఎస్ఐఆర్‌పై కూడా పని చేయాలని అన్నారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేసినవారిని రాహుల్ గాంధీతో సత్కరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లను నియమించి నిరంతర పర్యవేక్షణ చేయాలని, మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 17 లోక్‌సభ స్థానాల్లో ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. ఇన్‌చార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు పూర్తిగా పార్టీ పనులకు సమయం ఇస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఎవరికీ మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేశారు.

మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, వలసల కారణంగా ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నాయకులు బూత్ స్థాయికి వెళ్తేనే కార్యకర్తలు కూడా చురుకుగా పని చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని, నగరంలోని 15 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్‌పై అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలపరచడం, ఓటర్ల జాబితా రక్షణ, మరియు క్షేత్రస్థాయి సమన్వయం పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement