CM Revanth Reddy | ఆ రెండు కేసుల్లో.. నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
2019లో జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అప్పటి ఎంపీ అయిన రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున భారీ ర్యాలీ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ర్యాలీలో 40 కార్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లతో ప్రచారం నిర్వహించారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
2021లో కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారని రేవంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ప్రజా సమావేశాలపై పరిమితులు ఉన్నా వాటిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఎలక్షన్ సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, కోవిడ్ మార్గదర్శకాలు పాటించకపోవడం వంటి అంశాలపై కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణలో భాగంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఎదుట రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ కోర్టుకు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




