త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | కేంద్ర నిధుల సమీకరణపై దృష్టి.. సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

CS Sanjay Jaju | కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

P

Telangana | Published On Jul 21, 2026, 8.46 pm IST

CS Sanjay Jaju | కేంద్ర నిధుల సమీకరణపై దృష్టి.. సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
Advertisement

CS Sanjay Jaju | కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను గడువులోగా పంపించాలని, తద్వారా కేంద్ర నిధుల విడుదల వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గ్రూప్ కో-ఆర్డినేషన్ సమావేశాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ, శాఖల మధ్య సమన్వయం, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య పథకాల అమలు, ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిపై నిరంతర సమీక్ష చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా పథకాల పురోగతిని సీఎం డ్యాష్‌బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును అదే వేదికపై సమీక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement