Chief Secretary | 30న ముగియనున్న రామకృష్ణారావు పదవీకాలం.. తదుపరి సీఎస్ ఎవరో?
Chief Secretary | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) రామకృష్ణారావు (Ramakrishna Rao) పదవీ కాలం ఈ నెలాఖరున ముగియనుంది. మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Chief Secretary | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలాఖరున ముగియనుంది. మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు (Ramakrishna Rao) పదవీ కాలం ముగిసింది. అయితే ఆయనను కొనసాగించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఏడు నెలలు కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరింత కాలం పొడిగించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించటంతో ఆ గడువు జూన్ 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ మరోసారి సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ సర్వత్రా సాగుతున్నది.
రేసులో సీనియర్ ఐఏఎస్‌లు..
రామకృష్ణారావును కొనసాగించడానికి కేంద్రం నిరాకరించినట్లయితే సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ రేసులో ఉన్నారు. సంజయ్ జాజు, జయేశ్ రంజన్, వికాస్‌రాజ్, సవ్యసాచి ఘోష్ రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ఈ ఏడాది సెప్టెంబరు 30న పదవీ విరమణ చేయనున్నారు. ఇక మెట్రో పాలిటన్ అభివృద్ధి ప్రత్యేక సీఎస్ జయేశ్ రంజన్‌కు 2027 సెప్టెంబర్ వరకు సర్వీసు ఉంది.
మరోవైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఈశాన్య ప్రాంతాల అభిృవృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక సీఎస్ వికాస్‌రాజ్ 2028 మార్చి, ఫ్లాగ్‌షిప్ పథకాల అమలు విభాగం ప్రత్యేక సీఎస్ సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్ వరకు సర్వీసులో ఉండనున్నారు. నవీన్ మిట్టల్, దానకిషోర్, వాణిప్రసాద్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో సీఎం రేవంత్ ఎవరిని తదుపరి సీఎస్‌గా ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

KTR | చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



