త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ..!

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ప్ర‌చారం జోరందుకున్న‌ది. సీఎం రేవంత్‌, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగ‌నున్నారు.

G

Telangana | Published On Feb 2, 2026, 1.43 pm IST

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ..!
Advertisement
  • క‌రీంన‌గ‌ర్‌, రామ‌గుండంపై బీఆర్ఎస్ జెండా
  • మూడు పుర‌పాలిక‌ల్లో హ‌స్తం పైచేయి
  • మంచిర్యాల‌లో త‌గ్గాపోర్‌..
  • సీ-ప్యాక్ ఒపీనియ‌న్ పోల్ ఫ‌లితాలు

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ప్ర‌చారం జోరందుకున్న‌ది. సీఎం రేవంత్‌, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగ‌నున్నారు. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే నామినేష‌న్లు ముగియ‌గా, మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 3) మ‌ధ్యాహ్నానికి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగియ‌నుంది. దీంతో బ‌రిలో నిలిచేదెవ‌రో మ‌రో 24 గంట‌ల్లో స్ప‌ష్ట‌త రానుంది. ఇక ప్ర‌చార హోరు మ‌రింత పెరుగ‌నుంది.

ఈ క్ర‌మంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు ఎటువైపు ఉండ‌నున్నారు, ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నే విష‌య‌మై ప్ర‌ముఖ సంస్థ సివిక్ పోల్స్ అనాలిసిస్ క‌మిటీ (C-PAC) ఒపీనియ‌న్ పోల్ (Opinion Poll) నిర్వ‌హించింది. పుర‌పాల‌క ఎన్నిక‌లు హోరాహోరీగా సాగుతాయ‌ని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతాయ‌ని స‌ర్వేలో తేలింది. ఏడు పుర‌పాలిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌ని వెల్ల‌డించింది. కాంగ్రెస్ మూడు మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ రెండు, క‌మ్యూనిస్టులు ఒక మున్సిపాలిటీని ద‌క్కించుకుంటాయ‌ని తెలిపింది. మ‌రో మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని పేర్కొంది.

క‌రీంన‌గ‌ర్‌, రామ‌గుండ‌లో..

క‌రీంన‌గ‌ర్‌, రామ‌గుండ‌లో బీఆర్ఎస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌లో కాంగ్రెస్‌, కొత్త‌గూడెంలో సీపీఐ విజ‌యం సాధిస్తాయ‌ని తెలిపింది. మంచిర్యాల‌లో హ‌స్తం, కారు పార్టీ మ‌ధ్య ఫ‌లితం దోబూచులాడుతుంద‌ని పేర్కొంది.

రాష్ట్ర‌వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్ర‌వ‌రి 11న‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. 13న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement