త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | క‌రీంన‌గ‌ర్ ‘సింహ గ‌ర్జ‌న‌’కు 25 ఏండ్లు.. ఈ నాలుగే కేసీఆర్ ర‌థ చ‌క్రాలు.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్

KTR | ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌స్థానంలో క‌రీంన‌గ‌ర్ సింహ గ‌ర్జ‌న‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావించిన కొద్ది రోజుల‌కే అతిపెద్ద బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌గా.. ల‌క్ష‌లాది మంది త‌ర‌లివ‌చ్చి విజ‌య‌వంతం చేశారు.

S

Telangana | Published On May 17, 2026, 6.32 pm IST

KTR | క‌రీంన‌గ‌ర్ ‘సింహ గ‌ర్జ‌న‌’కు 25 ఏండ్లు.. ఈ నాలుగే కేసీఆర్ ర‌థ చ‌క్రాలు.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌స్థానంలో క‌రీంన‌గ‌ర్ సింహ గ‌ర్జ‌న‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావించిన కొద్ది రోజుల‌కే అతిపెద్ద బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌గా.. ల‌క్ష‌లాది మంది త‌ర‌లివ‌చ్చి విజ‌య‌వంతం చేశారు. అయితే క‌రీంన‌గ‌ర్ కేసీఆర్ సింహ గ‌ర్జ‌న స‌భ‌కు నేటితో(మే 17) 25 ఏండ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

చారిత్రాత్మక “కరీంనగర్‌ కేసీఆర్‌ సింహ గర్జన”కు 25 ఏండ్లు. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల క్రితం మే 17, 2001న స‌భ నిర్వ‌హించాం. నాటి సింహ గర్జన నుండి.. నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్‌ది అదే జోష్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు.. ఇది కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి అని కేటీఆర్ తెలిపారు.

ధన బలం లేదు. రాజకీయ బలగం పెద్దగా లేదు. అయినా సభా స్థలికి పోటెత్తిన జనం. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ట్రాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా.. ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను నడిపించిన నాలుగు రథ చక్రాలు! అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement