KTR | ఊ లేదు.. ఉప్పు రాయి లేదు.. రైతు డిక్లరేషన్‌పై కేటీఆర్ విమర్శలు
KTR | రైతు డిక్లరేషన్ ఏమైందంటే ఊ లేదు.. ఉప్పు రాయి లేదు.. ఎక్కడ సడి లేదు.. సప్పుడు లేదు.. అంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అని కేటీఆర్ కోపంతో ఊగిపోయారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రైతు డిక్లరేషన్ ఏమైందంటే ఊ లేదు.. ఉప్పు రాయి లేదు.. ఎక్కడ సడి లేదు.. సప్పుడు లేదు.. అంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అని కేటీఆర్ కోపంతో ఊగిపోయారు. వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ తీవ్ర ఆగ్రహంతో ప్రసంగించారు.
రైతులకు కాంగ్రెస్ నేతల జాతకాలు, గోత్రాలు తెలుసు. అయినా నమ్మారు. ఓటు వేశారు. ఇవాళ ఏమైంది పరిస్థితి. 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. బుద్ధిమంతులు అనుకొని మీరేమో చద్దులు కట్టిన్రు. వాళ్లేమో గద్దెల మీద కూర్చున్నరు. రైతు డిక్లరేషన్ ఏమైందంటే ఊ లేదు.. ఉప్పు రాయి లేదు. ఎక్కడ సడి లేదు సప్పుడు లేదు. ఎన్నికల ముందు వరాల వాన కురిపించారు. ఇప్పుడేమో దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. 34 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎకరానికి రూ. 15 వేలు వస్తున్నాయా..?
2 లక్షల రుణమాఫీ జరిగిందా..?
రైతు కూలీలకు రూ. 12 వేలు వేస్తున్నారా..?
అన్ని పంటలకు బోనస్ వస్తుందా..?
అన్ని పంటలు కొంటున్నారా..?
కౌలు రైతుకు ఎకరానికి రూ. 14 వేలు వస్తుందా..?
పంటల బీమా పథకం వచ్చిందా..?
అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చారా..?
34 హామీల్లో ఒక్కటైనా అమలైందా..?
నాలుగేళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా..? చెడిపోయిందా..?
అంటే ఏది లేదు. ఇది వాస్తవం. రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రం.. ఒక బక్వాస్ ముచ్చట. ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసినందుకే.. ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ఎన్నికల ముందు ఒట్లు పెట్టుకున్నారు.. ఓట్లు దొబ్బిండ్రు.. ఓట్లకు ముందు బట్టెవాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు.. ఇప్పుడు దోకేభాజ్ పనులు చేస్తుండ్రు. గల్లీ కార్యకర్త పత్తా లేడు. ఢిల్లీ నుంచి వచ్చి నేత కనబడుతనే లేడు. రాహుల్ గాంధీ నువ్వు చేసిన డిక్లరేషన్ ఎక్కడ సచ్చింది.. నువ్వెక్కడ సచ్చినవ్ రాహుల్ గాంధీ. నువ్వు మాకు అప్పజెప్పిబోయిన ముఖ్యమంత్రి ఏ గాడిద పళ్లు తోముతున్నడు. రైతులు కల్లాల వద్ద అవస్థలు పడుతున్నరు. మక్కలు కొనే పరిస్థితి లేదు. రైతుల కళ్లల్లో రక్తం కారే పరిస్థితి ఉంది. అందుకే అంటున్న రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అని అడుగుతున్నానని కేటీఆర్ ప్రశ్నించారు.
అన్నం తినే కంచంలో మన్ను పోయొచ్చా.. దుక్కి దున్నుకునే రైతులను ఇంత మోసం చేస్తారా..? సిగ్గు అనిపిస్తలేదా.. కాంగ్రెస్ నాయకులారా ఓట్లు కోసం గడ్డి తింటారా. రైతు సంగ్రామ సందస్సు పెట్టుకుంటే అక్కడ రైతు మెగా మేళా పెట్టుకున్నరు. అది రైతు మెగా మేళా కాదు.. దగా మెగా రైతు మేళా.. రైతులను దగా చేసిన దౌర్భాగ్య మేళా.. రైతులెవరూ అక్కడ లేరు అని కేటీఆర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



