త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అది పీసీ ఘోష్ క‌మిటీ రిపోర్టు కాదు.. పీసీసీ నివేదిక : కేటీఆర్

KTR | కాళేశ్వ‌రంపై ఏర్పాటైన పీసీ ఘోష్ క‌మిటీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది పీసీ ఘోష్ క‌మిటీ రిపోర్టు కాదు.. పీసీసీ నివేదిక అని ఆనాడే చెప్పామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

S

Telangana | Published On Apr 22, 2026, 6.46 pm IST

KTR | అది పీసీ ఘోష్ క‌మిటీ రిపోర్టు కాదు.. పీసీసీ నివేదిక : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రంపై ఏర్పాటైన పీసీ ఘోష్ క‌మిటీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది పీసీ ఘోష్ క‌మిటీ రిపోర్టు కాదు.. పీసీసీ నివేదిక అని ఆనాడే చెప్పామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

పీసీ ఘోష్ క‌మిటీ రిపోర్టు కాదు.. పీసీసీ నివేదిక అని ఆనాడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అది అక్ష‌ర స‌త్యం అని తేలిపోయింది. 28 ల‌క్ష‌ల క్యూసెక్కులు వ‌ర‌ద వ‌చ్చినా మేడిగ‌డ్డ త‌ట్టుకుని నిటారుగా నిల‌బ‌డ్డ‌ది. ఇది వాస్త‌వం. కాళేశ్వ‌రం కూలేశ్వ‌రం అయిపోయింద‌ని, ల‌క్ష కోట్లు కొట్టుకుపోయాయ‌ని కాంగ్రెస్, బీజేపీ సిగ్గులేకుండా మాట్లాడారు. చివ‌ర‌కు నోటికొచ్చిన‌ట్టు జ‌ల‌వ‌న‌రుల మంత్రి కూడా మాట్లాడారు.

ఇక రాష్ట్రంలో సీఎం నుంచి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ కార్య‌క‌ర్త వ‌ర‌కు పాడిందే పాట అన్న‌ట్టు ఒక‌టే మాట ఒక‌టే సొల్లు పురాణం.. 60 ఏళ్లు నీళ్లు ఇవ్వ‌కుండా ఏడిపించిన జ‌ల ద్రోహులు, రైతుల‌ను ఇబ్బందుల‌ను పెట్టిన రాబందుల‌కు ఈ తీర్పుతో జ్ఞానోద‌యం కలిగి ఉండాల‌ని అనుకుంటున్నాం.

తెలంగాణ రైతాంగానికి కాళేశ్వ‌రం వ‌ర ప్ర‌దాయిని.. కాంగ్రెస్ శనేశ్వ‌రం.. రైతుల‌కు కాళేశ్వ‌రం వ‌ర‌ప్ర‌దాయిని అనేది ఎంత స‌త్య‌మో.. రైతుల‌కు కాంగ్రెస్ శ‌నేశ్వ‌రం అనేది కూడా అంతే అక్ష‌ర స‌త్యం.. రైతులు ఇప్పుడిప్పుడే గ్ర‌హిస్తున్నారు. ప్రాజెక్టులు క‌ట్ట‌డం నీరు తేవ‌డం నేర‌మ‌న్న‌ట్టు ప్ర‌చారం చేశార‌ని కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement