త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అసెంబ్లీ న‌డ‌పాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

KTR | అసెంబ్లీని న‌డపాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదు.. కానీ న‌డ‌క‌ప త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో అనివార్యంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను పూర్తి చేసుకోవాల‌నే ఉద్దేశంతో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Mar 10, 2026, 5.33 pm IST

KTR | అసెంబ్లీ న‌డ‌పాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీని న‌డపాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదు.. కానీ న‌డ‌క‌ప త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో అనివార్యంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను పూర్తి చేసుకోవాల‌నే ఉద్దేశంతో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ నెల 16 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి చ్చిన త‌ర్వాత ఇవి మూడో బ‌డ్జెట్ స‌మావేశాలు. దాదాపుగా దీన్ని పెనాల్టీమెట్ బ‌డ్జెట్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయ‌ర్ పెట్టే బ‌డ్జెట్ కొన్ని నెల‌ల కోస‌మే పెట్టే బ‌డ్జెట్. 2027లో పెట్టేది వారి చివ‌రి బ‌డ్జెట్ అవుతుంది. దాని కంటే ముందు పెట్టే బ‌డ్జెట్ పెనాల్టీమెట్ బ‌డ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం యొక్క ప్రాధాన్యాలు, ఇచ్చిన హామీల విష‌యంలో వారి చిత్త‌శుద్ధి ఈ బ‌డ్జెట్ ద్వారా బ‌య‌ట‌ప‌డబోతోంది. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ఉన్న ప్రాముఖ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల‌తో క‌లిసి సంయుక్తంగా వ‌ర్క్ షాప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ఈ బ‌డ్జెట్‌లో ఏ ర‌కంగా మ‌నం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించాలి. దాంతో పాటు బ‌డ్జెట్‌ను ఎలా విశ్లేషించాలి.. అనే దానిపై సుదీర్ఘంగా చ‌ర్చించాం అని కేటీఆర్ తెలిపారు.

అంకెల గార‌డీపై అధ్య‌య‌నం 

బండా ప్ర‌కాశ్ రాజ్య‌స‌భ‌లో ప‌ని చేశారు. అక్క‌డున్న ప్రాక్టీసెస్, డిప్యూటీ చైర్మ‌న్‌గా వారికున్న అనుభ‌వం చెప్పారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్‌ మ‌ధుసూద‌నాచారి వారు స్పీక‌ర్ గా ఉన్న అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్ర‌భుత్వ ఫెయిల్యూర్ విష‌యంలో ఎలా స్పందించాలో చెప్పారు. ఉమ్మ‌డి ఏపీలో స‌భ‌లో కేసీఆర్ అద్భుతంగా స‌మ‌యాన్ని వినియోగించుకున్న విష‌యాన్ని చెప్పారు. పార్టీ ప‌రంగా లేవ‌నెత్తాల్సిన అంశాలు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు కొన్ని విష‌యాలు మాట్లాడుకున్నాం. మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతాం. బ‌డ్జెట్‌లోని ప్రాధాన్య‌త అంశాల‌ను, ప్ర‌భుత్వం చేసే అంకెల గార‌డీని అధ్య‌య‌నం చేసే విష‌యంపై ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు విలువైన సూచ‌న‌లు ఇచ్చార‌ని కేటీఆర్ తెలిపారు.

అనివార్యంగా బ‌డ్జెట్ సెష‌న్

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పైనే కాకుండా, ప్ర‌జల‌కు చేసిన మోసాలు, నిరంత‌రం చేస్తున్న అరాచ‌కాల‌పై నిల‌దీసేందుకు బీఆర్ఎస్ స‌న్న‌ద్ధంగా ఉంది. చ‌ట్ట‌స‌భ‌ల్లో కీల‌క‌మైన క‌మిటీలు.. రెండేండ్లు అవుతున్న డిప్యూటీ స్పీక‌ర్, స్టాండింగ్ క‌మిటీలు లేవు. ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందిన స‌భ్యుడు చైర్మ‌న్‌గా ఉండాలి. కేసీఆర్ హ‌రీశ్‌రావు పేరును ప్ర‌తిపాదిస్తే స్పీక‌ర్ ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల్లో పార్టీ మారిన శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యేకు అవ‌కాశం ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని మంట‌లో క‌లిపారు. వారికి అసెంబ్లీ న‌డ‌పాల‌న్న ఇష్టం లేదు నిజానికి. న‌డ‌పక‌ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో అనివార్యంగా బ‌డ్జెట్ సెష‌న్ ముగించాల‌ని, తూతూ మంత్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రయోగిస్తున్నది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement