KTR | రైతుల కోసం పదేండ్లలో రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం : కేటీఆర్
KTR | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో రైతుల కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ ఈ రెండున్నరేండ్లలోనే రూ. 3 లక్షల 72 వేల కోట్లు ఖర్చు పెట్టి.. రైతులకు చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో రైతుల కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ ఈ రెండున్నరేండ్లలోనే రూ. 3 లక్షల 72 వేల కోట్లు ఖర్చు పెట్టి.. రైతులకు చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు.
ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో నెర్రెలుబారిన నేలలు, కరెంట్ కోతలు, దొంగరాత్రి కరెంట్, పాముకాట్లు, ఎండిపోయిన పొలాలు, ఆకలి కేకలు.. ఆగమైన తెలంగాణను బాగు చేయాలని పదేండ్లు ప్రాణం పెట్టి రైతుల కోసం కేసీఆర్ పని చేశారు. అద్భుతమైన పథకాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ తెలిపారు.
రైతుబంధు కోసం రూ. 73 వేల కోట్లు, రుణమాఫీ కోసం రూ. 29 వేల కోట్లు, 24 గంటల కరెంట్ కోసం రూ. లక్ష కోట్లు, కాళేశ్వరం, పాలమూరు సీతారామ సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా 60 వేల కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు లక్షా 32 వేల కోట్లు కేటాయించాం. పదేండ్లలో రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం రైతుల కోసం. అందుకే దేశానికి అన్నపూర్ణగా అవతరించింది తెలంగాణ. కేసీఆర్ వచ్చాక రైతుకు గుండె ధైర్యం పెరిగింది. ఆత్మహత్యలు తగ్గాయని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ రెండున్నరేండ్లలో రూ. 3 లక్షల 72 వేల కోట్లు అప్పు చేశారు. ఎవర్నీ ఉద్దరిస్తున్నారు.. పచ్చగా ఉన్న తెలంగాణలో చీడ పురుగుల్లా కాంగ్రెసోళ్లు వచ్చారు. దేశం మొత్తం వదిలించుకున్న పార్టీ కాంగ్రెస్. ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి.. యూరియా ఇవ్వడం లేదు.. తొక్కిసలాటలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. వెనుకటి రోజులు మళ్లీ తీసుకువస్తాం అంటే మళ్లీ వచ్చాయి. విత్తనాలు, యూరియా పోలీసు స్టేషన్‌లో పంచే రోజులు వచ్చాయి. ఎంత మందికి యాప్ వాడే తెలివి ఉంది. ఈ రైతు వేదిక సదస్సుగా యాప్‌ల పేరిట జరుగుతన్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో యూరియా అందించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



