త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 60 సార్లు ఢిల్లీకి పోయి 6 పైస‌లు కూడా తేలేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

KTR | కేంద్ర బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా, మిగిలింది మొండి చెయ్యి మాత్రమే అని కేటీఆర్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On Feb 1, 2026, 9.52 pm IST

KTR | 60 సార్లు ఢిల్లీకి పోయి 6 పైస‌లు కూడా తేలేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Advertisement

రేవంత్ ఘోర వైఫ‌ల్యం వ‌ల్లే తెలంగాణ‌కు గుండుసున్నా..
ఛోటాభాయ్ మాట‌ల‌న్నీ బూట‌క‌మే..
ఇద్ద‌రు కేంద్ర మంత్రులుండి దండ‌గ‌..
చీక‌టి ఒప్పందాల‌తోనే తెలంగాణ గోంతు కోశారు..
కేంద్ర బ‌డ్జెట్‌పై ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ స్పంద‌న‌

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా, మిగిలింది మొండి చెయ్యి మాత్రమే అని కేటీఆర్ విమ‌ర్శించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లరపైసలు కూడా తేలేని చేతకాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ దౌర్భాగ్యం అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

బడాభాయ్‌తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన ఛోటాభాయ్ మాటలన్నీ బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలిపోయింది. రేవంత్ చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మోసేందుకు, బీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న ముఖ్యమంత్రి స్కాములపై విచారణ జరపకుండా కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునేందుకేనని మరోసారి రుజువైంది. రాష్ట్రం నుంచి పేరుకు ఇద్దరు కేంద్రమంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడం వల్లే తెలంగాణకు చిల్లి గవ్వ కూడా కేంద్ర బడ్జెట్‌లో దక్కలేదు అని కేటీఆర్ అన్నారు.

పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తోపాటు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన చెరో ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు ? మీ సొంత పైరవీల కోసమా మిమల్ని తెలంగాణ ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపించింది ?? స్వీయ రాజకీయ అస్థిత్వమైన బీఆర్ఎస్‌కు లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడంవల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. చీకటి ఒప్పందాలతో తెలంగాణ గొంతు కోసిన ముఖ్యమంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది కాంగ్రెస్, మరో 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి మూకుమ్మడిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement