త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతుకు ఓపిక న‌శిస్తే భూకంపం పుట్టిస్త‌డు.. యాది పెట్టుకో రేవంత్ : కేటీఆర్

KTR | రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది.. కానీ అదే రైతుకు ఓపిక న‌శిస్తే భూకంపం పుట్టించే శ‌క్తి కూడా అదే రైతుకు ఉంటుంది యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. నాగ‌ళ్ల‌తోని పొలాల‌ను దున్న‌డం తెలుసు.. నాగ‌లి తిరిగేసి కాంగ్రెసోళ్ల‌ను ఊరురా ఉరికించి కొట్ట‌డం కూడా అదే రైతుకు తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On May 6, 2026, 4.48 pm IST

KTR | రైతుకు ఓపిక న‌శిస్తే భూకంపం పుట్టిస్త‌డు.. యాది పెట్టుకో రేవంత్ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది.. కానీ అదే రైతుకు ఓపిక న‌శిస్తే భూకంపం పుట్టించే శ‌క్తి కూడా అదే రైతుకు ఉంటుంది యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. నాగ‌ళ్ల‌తోని పొలాల‌ను దున్న‌డం తెలుసు.. నాగ‌లి తిరిగేసి కాంగ్రెసోళ్ల‌ను ఊరురా ఉరికించి కొట్ట‌డం కూడా అదే రైతుకు తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు.

రెండు పంట‌ల‌కే రైతుబంధు ఇస్తారా..? అని రేవంత్ అన్నాడు. ఇవాళ ఒక్క పంట‌కు కూడా స‌క్క‌గా ప‌డ‌డం లేదు. స‌ర్పంచ్ ఎన్నికల ముందు రైతుబంధు వేసిండు.. మొత్తంగా ఇప్ప‌టికీ ఒక్క‌టేసారి వేసిండు. రైతుబంధును ఆపిన దివానాగాడు ఎవ‌డు..? అరే హౌలా, దివానా ఎందుకు బంద్ పెట్టిన‌వ్.. నీ అయ్యా సొమ్మా.. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవ‌డు..? రైతుబీమాను బొంద పెట్టిన హౌలాగాడు ఎవ‌డు..? రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌ని దివానాగాడు ఎవ‌డు..? రూ. 500 బోన‌స్ ఎగ్గొట్టిన దోకేబాజ్ గాడు ఎవడు..? పంట‌ల‌ను కొనుగోలు చేయ‌ని బ‌ట్టేవాజ్ గాడు ఎవ‌డు..? కేసులు కాక‌పోతే ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమ‌ను వాని అయ్యా.. దేక్‌లేంగే అని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతు భిక్ష‌గాడు కాదు..

కేసీఆర్ రైతుకు రైతుబంధు హ‌క్కుగా క‌ల్పించాడు. రైతు భిక్ష‌గాడు కాదు.. రైతుబంధు నీ ద‌యాదాక్షిణ్యం కాదు. అంత‌క‌న్న నీ అయ్య సొమ్ము కాదు. దేశానికి అన్నం పెట్టే రైతును.. అడుక్కుతినేటోడిని చూసిన‌ట్టు.. కేసీఆర్ మీటింగ్‌లు పెట్ట‌గానే త‌మాషా చేసుకుంటూ బ‌లుపు మాట‌లు మాట్లాడుకుంటూ.. రైతు జోల ప‌ట్టుకున్న‌ట్టు రైతుబంధు వేస్తున్న‌డు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు అవ‌మానిస్తున్న‌వ్.. రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. కానీ అదే రైతుకు ఓపిక న‌శిస్తే భూకంపం పుట్టించే శ‌క్తి కూడా అదే రైతుకు ఉంటుంది యాది పెట్టుకో. నాగ‌ళ్ల‌తోని పొలాల‌ను దున్న‌డం తెలుసు.. నాగ‌లి తిరిగేసి కాంగ్రెసోళ్ల‌ను ఊరురా ఉరికించి కొట్ట‌డం కూడా అదే రైతుకు తెలుసు అని కేటీఆర్ తెలిపారు.

రెగ్యుల‌ర్ సీఎం కాదు.. రెన్యూవ‌ల్ సీఎం..

ఆ రోజేమో కేసీఆర్ ఉన్న‌ప్పుడు రైతుల ఖాతాలో పైస‌లు ప‌డేవి. ఇవాళ ఎక్క‌డ ప‌డుతున్నాయంటే రాహుల్ ఖాతాలో ప‌డుతున్న‌య్.. రాహుల్ బంద్ అని పెట్టిండు.. రెగ్యుల‌ర్ సీఎం కాదు.. రెన్యూవ‌ల్ సీఎం. క‌ప్పం క‌ట్టి రెన్యూవ‌ల్ చేయించుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాకం గాంధీ కాపాడ‌లేరు. ఒక్కో ఎక‌రానికి రూ. 26, 00 బాకీ ప‌డ్డాడు. మొత్తంగా రూ. 30 వేల కోట్లు బాకీ ఉన్న‌ది. నియంత‌ల‌ను ఉరికించిన గ‌డ్డ ఓరుగ‌ల్లు గ‌డ్డ‌. నిజాంను ఉరికించారు. చాక‌లి ఐల‌మ్మ‌, దొడ్డి కొముర‌య్య‌.. స్ఫూర్తితో ఉన్న గ‌డ్డ‌.. నువ్వెంత నీ కాంగ్రెస్ ఎంత మా రైతులు త‌ల‌చుకుంటే అని కేటీఆర్ అన్నారు.

కౌలు రైతుల‌కు ప్రేమ ప‌త్రాలు

రైతుబంధు వేస్తా అని 22 ల‌క్ష‌ల మంది కౌలు రైతుల‌కు ప్రేమ ప‌త్రాలు రాసిండు రేవంత్ రెడ్డి. పొంక‌నాల పోతిరెడ్డికి మూడు ఎడ్లు.. 30 దొడ్లు అన్న‌ట్టుంది రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం. కాంగ్రెస్ మోసాన్ని కౌలు రైతులు గుర్తు పెట్టుకోవాలి. కౌలుదార్ల‌కు 22 వేల 500 కోట్లు బాకీ ప‌డ్డారు. కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీయండి అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement