త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్ర‌తి బొగ్గు గ‌నిలో మ‌ళ్లీ అగ్గి మండిస్తాం.. రేవంత్‌కు కేటీఆర్ హెచ్చ‌రిక‌

KTR | సింగ‌రేణిలో మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేసి వార‌స‌త్వ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే.. ప్ర‌తి బొగ్గు గ‌నిలో మ‌ళ్లీ అగ్గి మండిస్తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. మెడిక‌ల్ బోర్డు పెట్ట‌క‌పోతే.. సింగ‌రేణి ప్ర‌ధాన కార్యాల‌యాన్ని బీఆర్ఎస్ త‌ర‌పున ముట్టడిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Apr 12, 2026, 3.54 pm IST

KTR | ప్ర‌తి బొగ్గు గ‌నిలో మ‌ళ్లీ అగ్గి మండిస్తాం.. రేవంత్‌కు కేటీఆర్ హెచ్చ‌రిక‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : సింగ‌రేణిలో మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేసి వార‌స‌త్వ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే.. ప్ర‌తి బొగ్గు గ‌నిలో మ‌ళ్లీ అగ్గి మండిస్తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. మెడిక‌ల్ బోర్డు పెట్ట‌క‌పోతే.. సింగ‌రేణి ప్ర‌ధాన కార్యాల‌యాన్ని బీఆర్ఎస్ త‌ర‌పున ముట్టడిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చ‌రించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ రాష్ట్రంలో సీఎం సీఎంలాగా, మంత్రులు మంత్రులాగా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలాగా లేరు. దోచుకోవాలి దాచుకోవాలి అనే స్కీం న‌డుస్తుంది. ఉట్టిగ‌నే అంట‌లేను. సీఎం కుటుంబం మొత్తం స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా దోపిడీకి తెర తీశారు. సింగ‌రేణి సంస్థలోని ప్ర‌తి కాంట్రాక్టు సీఎం బామ్మ‌ర్ది సృజ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంది. కుంభ‌కోణాల‌కు తెర‌లేపిందే సీఎం కుటుంబం. సైట్ విజిటేష‌న్ స‌ర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని సృజన్ రెడ్డి వేల కోట్ల కుంభ‌కోణాల‌కు పాల్ప‌డితే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడ‌డం లేదు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ద‌మ్ముంటే నీ బామ్మ‌ర్ది కుంభ‌కోణాల మీద సిట్ వేయ్..

మెడిక‌ల్ బోర్డు, ఇన్ వ్యాలిడేష‌న్ గురించి స్థానిక యువ‌త ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలి. కేసీఆర్ హ‌యాంలో 16 వేల మందికి మెడిక‌ల్ బోర్డు ద్వారా వార‌స‌త్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా, మెడిక‌ల్ బోర్డు పెట్ట‌క‌పోగా, గ‌తంలో ఇచ్చిన 16 వేల ఉద్యోగాల మీద ఏసీబీ, విజిలెన్స్ విచార‌ణ జ‌రిపిస్తార‌ట‌. ద‌మ్ముంటే నీ బామ్మ‌ర్ది కుంభ‌కోణాల మీద సిట్ వేసి విచార‌ణ జ‌రిపించండి. వార‌స‌త్వ ఉద్యోగాల మీద కూడా విచార‌ణ చేసుకో.. ఫ‌ర‌క్ ప‌డ‌దు. కానీ ముందు మెడిక‌ల్ బోర్డు పెట్టు.. వేలాది మంది ఎదురుచూస్తున్నారు. లేదంటే సింగ‌రేణి ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్ని బీఆర్ఎస్ త‌ర‌పున ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాం. స్థానిక యువ‌త‌ క‌దిలి రావాలి. ప్ర‌తి బొగ్గు గ‌నిలో మ‌ళ్లీ అగ్గి మండిస్తాం.. వ‌దిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

అభ‌య‌హ‌స్తం భ‌స్మాసుర హ‌స్త‌మైంది..

క‌త్తి వానికి ఇచ్చి యుద్ధం మ‌మ్మ‌ల్ని చేయ‌మంటే ఎట్ల‌.. అయినా కూడా బ‌రాబ‌ర్ కొట్లాడుతాం.. క‌లిసి రండి.. క‌దిలి రండి.. మీ ఎమ్మెల్యేల‌ను గ‌ల్లా ప‌ట్టి నిల‌దీయండి.. అభ‌య హ‌స్తం మేనిఫెస్టో అన్నారు.. కార్మికుల‌కు తియ్య‌టి పుల్ల‌టి మాట‌లు చెప్పారు.. అభ‌య‌హ‌స్తం భ‌స్మాసుర హ‌స్త‌మైంది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకుని బూడిద‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ద‌రిద్రం ఎప్పుడు పోత‌దా అని ఎదురుచూస్తున్నారు. అందుకే ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగ‌మై అడ్డ‌మైనోళ్ల‌కు ఓట్లు వేయొద్దు. నిరాశ‌ప‌డ‌కండి.. గ‌ల్లా ప‌ట్టి నిల‌దీసి క‌చ్చితంగా మ‌ళ్లీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్య‌త తీసుకుంటాం.. త‌ప్ప‌కుండా మీ కోసం కొట్లాడుతాం. వార‌స‌త్వ ఉద్యోగాలు, మారుపేర్ల విష‌యంలో ప‌రిష్కారం జ‌ర‌గాలంటే మాకు అండ‌గా నిల‌బ‌డండి. ప్ర‌తి బొగ్గు గ‌ని డివిజ‌న్‌లో గ‌ళ‌మెత్తుతాం. మీరు క‌లిసి రండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement