KTR | సింగరేణిలో రూ. 1600 కోట్ల కుంభకోణం.. సీఎం గమ్మున ఎందుకున్నడు : కేటీఆర్
KTR | సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రూ. 1600 కోట్ల కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకు ఉన్నాడు.. దీనిపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను అని కేటీఆర్ తెలిపారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రూ. 1600 కోట్ల కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకు ఉన్నాడు.. దీనిపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను అని కేటీఆర్ తెలిపారు. చంచల్‌గూడ జైల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడయాతో మాట్లాడారు.
సింగరేణిలో రూ. 15 వేల కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. సోలార్ టెండర్ల విషయంలో అక్రమంగా వందల కోట్ల స్కాం జరిగింది. నైనీ బొగ్గు టెండర్ల విషయంలో మంత్రులకు సీఎంకు వాటాలు కుదరక మీడియాలో పని చేసే జర్నలిస్టులను అరెస్టు చేశారు. చివరకు నైనీ బొగ్గు టెండర్లు రద్దు అయ్యాయని కేటీఆర్ తెలిపారు.
సింగరేణి సమస్యలపై తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతున్నది. మేం 19 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు ఎత్తేసి వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామని భట్టి చెప్పారు. ఇవన్నీ సింగరేణి కార్మికులను కలవరానికి గురి చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో బాల్క సుమన్ కార్మికుల ఆవేశాన్ని, అక్రోషాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. సుమన్‌ను అరెస్టు చేసి సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు బయటకు రాకుండా చేశారు. అతనిపై ఇష్టమొచ్చిన కేసులు పెట్టి చంచల్‌గడ జైల్లో వేశారు. మరి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉన్నదని భావిస్తే.. కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రగతి భవన్‌ను బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదన్నారు. మరి ఆయనపై చర్యలు తీసుకోరా..? చంచల్‌గూడ జైలుకు తిరిగి రావడానికి ఆయన అర్హుడు కాదా..? బండి సంజయ్ ఎంపీగా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడంం శిక్షార్హం కాదా..? మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయించడమే కాదు.. పెట్రోల్ పోసి తగులబెడతా హరీశ్ రావును అంటే చర్యలు తీసుకోరా..? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫార్మా కంపెనీని తగులబెడుతా అంటే చర్యలు ఉండవా..? కాంగ్రెసోళ్లకు ఒకనీతి.. సుమన్‌కు ఒక నీతా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలో సుమన్‌పై 220 కేసులు పెట్టారు. ఆ రికార్డును బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెసోళ్లు. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నా గురించి బాధ పడకండి.. సింగరేణి కార్మికులపై దృష్టి పెట్టండి అని సుమన్ చెప్పారు. జైలు కొత్త కాదు.. పోరాటం కొత్త కాదు.. సీఎం అక్రమాలను, అన్యాయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!
- ●Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..
- ●KTR | పాతబస్తీలో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించాను : కేటీఆర్
- ●Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..




