KTR | కాళేశ్వరం ఖర్చు లక్ష కోట్లు కాదు.. రూ. 94 వేల కోట్లే : కేటీఆర్
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చు లక్ష కోట్లు కాదు.. రూ. 94 వేల కోట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ సన్నాసులు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.. అవి తప్పని తేలిపోయింది అని కేటీఆర్ అన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చు లక్ష కోట్లు కాదు.. రూ. 94 వేల కోట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ సన్నాసులు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.. అవి తప్పని తేలిపోయింది అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మేం దిగిపోయే నాటికి జరిగిన ఖర్చు 94 వేల కోట్లు.. తెలివితక్కువ దద్దమ్మ రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి కాళేశ్వరం ఎటీఎం అయిపోయిందని మాట్లాడారు. ఒక పర్రెను చూసి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందన్నారు. ఇష్టమొచ్చిన చిల్లర ప్రచారం చేశారు. కొందరేమో లక్ష కోట్ల కుంభకోణం అంటారు.
కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు.. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. మేడిగడ్డ బరాజ్‌కు అయిన ఖర్చు రూ. 3800 కోట్లు. 85 పియర్స్ ఉన్నాయి. రెండింటికి కొంత నష్టం జరిగింది.. ఉట్టిగనే కుంగలేదు.. ఈ దుర్మార్గులు ఏదో చేశారు. నిజం నిలకడగా తేలుతుంది. రూ. 400 కోట్లతో మేమే పిల్లర్లకు మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వస్తే.. వాళ్లను బెదిరించి, జైల్లో పెడుతామని చెప్పి మేడిగడ్డ బరాజ్ విషయంలో కుట్రలు చేశారు.
రూ. 94 వేల కోట్లలో రూ. 400 కోట్లు నష్టం జరిగింది. ఇది వాస్తవం.. లక్ష కోట్లు అని ఒక సన్నాసి అంటే దానికి ఇంకోఎ సన్నాసి బీజేపీ వంత పాడింది. పొలిటికల్ మైలేజ్ కోసం మమ్మల్ని డ్యామేజ్ చేసేందుకు దారుణ ప్రచారం చేశారు. విద్యుత్ కమిషన్ ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. ఘోష్ రిపోర్టు తేలిపోయింది. ఇంకో రెండు మూడు ఉన్నాయి.. అవి కూడా తేలిపోతాయి. నిజం నిలకడ మీదనే తేలుతది.. ప్రజలు అర్థం చేసుకోవాలి.
అది మేడిగడ్డ కాదు మేటిగడ్డ.. కాళేశ్వరమే కల్పతరువుగా భావించిన సీఎం.. ఈ ఏడాది కరువు ఉందని చెప్పి.. బుద్ది తెచ్చుకుని రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తున్నారు. హైదరాబాద్‌కు మూసీ ప్రాజెక్టుకు 20 టీఎంసీలు తెస్తానని సీఎం చెప్తాడు. ఆలేరు, భువనగిరి నీళ్లు తీసుకుపోతా అంటాడు.. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అని కేటీఆర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



