త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | మ‌న్నె క్రిశాంక్ అరెస్ట్‌.. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌

Manne Krishank | బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌ను (Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధ‌రాత్రి మారేడుప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

G

Telangana | Published On Apr 24, 2026, 7.04 am IST

Manne Krishank | మ‌న్నె క్రిశాంక్ అరెస్ట్‌.. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌
Advertisement

Manne Krishank | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌ను (Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధ‌రాత్రి మారేడుప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌తోస‌హా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ రాజేంద‌ర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టులో హాజ‌రుప‌రుచ‌గా న్యాయ‌మూర్తి వారికి జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధించారు.

కాగా గత కొన్ని రోజులుగా అంగన్‌వాడీలకు సంబంధించిన మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ క్రిశాంక్ వరుస పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికార వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేప‌థ్యంలో క్రిషాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement