BRS | నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. ఆహ్వానం ఉన్నవారికే ప్లీనరీకి అనుమతి
BRS | భారత రాష్ట్ర సమితి (BRS).. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న బీఆర్ఎస్.. నేటితో 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది.
BRS | త్రినేత్ర.న్యూస్: భారత రాష్ట్ర సమితి (BRS).. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న బీఆర్ఎస్.. నేటితో 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది. 14 ఏండ్ల పోరాటం, 10 ఏండ్ల పాలన.. ప్రస్తుతం విపక్షం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటూ.. తెలంగాణకు తామే శ్రీరమ రక్ష అని నిరూపించుకున్నది. సోమవారంతో 25వ ఆవిర్భావ దినోత్స వేడుకలను జరుపుకుంటున్నది. పార్టీ అధినే కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, పార్టీ శ్రేణుల పోరాటాలు, తాజా రాజకీయ సమీకరణాలు, పార్టీ కార్యవర్గ విస్తరణ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్యవర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేశారు. మరోవైపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పార్టీ జెండాను ఎగురవేయనున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



