త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | డిక్లరేషన్లు ప్రకటించిన చోటే బీఆర్‌ఎస్‌ సమరశంఖం.. మే 6న వరంగల్‌లో రైతు సభ

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అన్న‌దాత‌ల క‌ష్టాల‌పై బీఆర్ఎస్ పార్టీ (BRS) స‌మ‌ర‌శంఖం పూరించింది. రైతు డిక్లరేషన్ (Rythu Declaration) పేరుతో కాంగ్రెస్ (Congress) చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైత‌న్న‌లతో సభ నిర్వహించనుంది.

G

Telangana | Published On Apr 30, 2026, 8.27 am IST

BRS | డిక్లరేషన్లు ప్రకటించిన చోటే బీఆర్‌ఎస్‌ సమరశంఖం.. మే 6న వరంగల్‌లో రైతు సభ
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అన్న‌దాత‌ల క‌ష్టాల‌పై బీఆర్ఎస్ పార్టీ (BRS) స‌మ‌ర‌శంఖం పూరించింది. రైతు డిక్లరేషన్ (Rythu Declaration) పేరుతో కాంగ్రెస్ (Congress) చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైత‌న్న‌లతో సభ నిర్వహించనుంది. డిక్ల‌రేష‌న్ల పేరుతో రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ చేసిన మోసాల‌ను ఎండ‌గ‌ట్టేలా వ‌చ్చేనెల 6న వ‌రంల్‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికోసం ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన చోటే ఈ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది.

నాలుగేండ్ల కింద రాహుల్‌ గాంధీ వరంగల్‌ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో తెలంగాణ రైతాంగాన్ని వంచించిన రైతుద్రోహి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. రైతు డిక్లరేషన్‌ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, రెండున్నరేండ్లు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ధాన్యం కొనుగోళ్ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు గ‌ళం విప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాసిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోవ‌డం హ‌రీశ్ రావు రైతుల‌ పక్షాన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
Advertisement