త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ పేరు వింటేనే ప్ర‌జ‌లు బూతుల వ‌ర్షం కురిపిస్తున్నారు : కేటీఆర్

KTR | సీఎం రేవంత్ రెడ్డి పేరు వింటేనే ప్ర‌జ‌లు బూతుల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Apr 26, 2026, 4.57 pm IST

KTR | రేవంత్ పేరు వింటేనే ప్ర‌జ‌లు బూతుల వ‌ర్షం కురిపిస్తున్నారు : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి పేరు వింటేనే ప్ర‌జ‌లు బూతుల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని ఆయ‌న అన్నారు. కేటీఆర్ స‌మ‌క్షంలో హుజూర్‌నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు.

కేసీఆర్‌ను మూడు, నాలుగు ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను దూషించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఆయ‌న‌ను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌ట్లేదు. టీహ‌బ్‌లో పుట్టిన కంపెనీ అంత‌రిక్షంలోకి రాకెట్లు పంపుతుంది.. నిన్న ఆ కంపెనీ వ‌ద్ద‌కు వెళ్లి రిబ్బ‌న్లు క‌ట్ చేస్తున్నాడు.. ఫోజులు కొడుతున్న‌డు రేవంత్ రెడ్డి. అక్క‌డ ఓ యాంక‌ర్ మాట్లాడుతూ.. సీఎం శ్రీధ‌ర్ బాబు అని సంబోధించారు. ఇది మొద‌టిసారి కాదు అంత‌కంటే చివ‌రి సారి కాదు.. యాకంర్లు ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌డం లేదు. సీఎం పేరు వింటేనే ప్ర‌జ‌లు బూతుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ముఖం తిప్పుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.

పాత న‌ల్ల‌గొండ జిల్లాలో 12 సీట్లు ఉంటే 11 కాంగ్రెస్ గెలిచింది. కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ జ‌రిగింది జ‌రిగిపోయింది. మ‌న త‌ప్పులు ఉండొచ్చు.. లోటుపాట్లు.. అసంతృప్తులు ఉండొచ్చు.. త‌ప్పు చేసి ఉంటాం.. ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు.. ఓడిపోయామ‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement