BRS Party | ఆ ముగ్గురికి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు..
BRS Party | బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది.
కొండపోచమ్మ సాగర్ నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు
మళ్లించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు
పోస్టులు తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్
తొలగించకపోతే పరువు నష్టం తప్పదని హెచ్చరిక
BRS Party | త్రినేత్ర న్యూస్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు పంపించారు.
ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Shashi Tharoor | నోబెల్ గ్రహీత నవీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు
- ●Maheshkumar Goud | చార్మినార్‌తో రాజీవ్‌కు ఎంతో మంచి అనుబంధం ఉంది
- ●Imran Khan Bombay High Court | భారత్ వీడి వెళ్లాలంటూ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారణ
- ●MP Mallu Ravi | రైతులు ఆచితూచి పంటలు వేయాలి
- ●Harish Rao | పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల్సిందే: హరీశ్ రావు
- ●Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా ఇది నా తొలి బతుకమ్మ - రష్మిక కామెంట్స్ - నెటిజన్ల ప్రశంసలు

Shashi Tharoor | నోబెల్ గ్రహీత నవీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు

Maheshkumar Goud | చార్మినార్‌తో రాజీవ్‌కు ఎంతో మంచి అనుబంధం ఉంది

Imran Khan Bombay High Court | భారత్ వీడి వెళ్లాలంటూ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారణ

MP Mallu Ravi | రైతులు ఆచితూచి పంటలు వేయాలి




