త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shashi Tharoor | నోబెల్ గ్ర‌హీత న‌వీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు

Shashi Tharoor | ఈ ఏడాది నోబెల్ శాంతి (Nobel peace prize) పురస్కారానికి ఎంపికైన భార‌త సంత‌తి మ‌హిళ నవనీతమ్ నవీ పిళ్లె (Navanethem "Navi" Pillay)ను కేంద్రం అభినందిచ‌క‌పోవ‌డాన్ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) తీవ్రంగా త‌ప్పుబట్టారు.

D

National | Published On Oct 19, 2026, 1.58 pm IST

Shashi Tharoor | నోబెల్ గ్ర‌హీత న‌వీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు
Advertisement

Shashi Tharoor | త్రినేత్ర న్యూస్ : ఈ ఏడాది దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయనిపుణురాలు నవనీతమ్ నవీ పిళ్లె (Navanethem "Navi" Pillay) కు నోబెల్ శాంతి (Nobel peace prize) పురస్కారం దక్కిన విష‌యం తెలిసిందే. భార‌త దేశ మూలాలున్న ఆమెకు నోబెల్ వ‌రించ‌డంపై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డాన్ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) తీవ్రంగా త‌ప్పుబట్టారు.

అంతర్జాతీయ చట్టాలు, శాంతి స్థాపన కోసం కృషి చేసినందుకు గాను నవీ పిళ్లెకు నోబెల్ పురస్కారం లభించింద‌ని థ‌రూర్ గుర్తు చేశారు. పిళ్లెను అభినందిస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశాలు రాకపోవడం శోచనీయమన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. "పిళ్లెకు నోబెల్ బ‌హుమ‌తి వ‌రించి ఆరు రోజులు గడుస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన భారత సంతతి మహిళకు.. ఆమె పూర్వీకుల దేశ‌మైన భార‌త ప్ర‌భుత్వం నుంచి క‌నీసం అభినంద‌న‌లు కూడా తెల‌ప‌లేదా..? ఇది చాలా సిగ్గుచేటు" అంటూ థ‌రూర్ మండిప‌డ్డారు.

న్యాయ నిపుణురాలిగా ఆమె సాగించిన సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను, ఆమె జీవిత విశేషాలను తెలియజేసే ఏఐ (AI) ద్వారా రూపొందించిన వీడియోను కూడా శశిథరూర్ తన పోస్టుకు జతచేశారు. అయితే, థ‌రూర్ పోస్టుపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మీ సొంత పార్టీ కూడా స్పందించ‌లేదే..? అంటూ థ‌రూర్‌కు నెటిజ‌న్లు చుర‌క‌లంటిస్తున్నారు. కేంద్రాన్ని మాత్రమే నిందించడం ద్వంద్వ నీతి అని మండిప‌డుతున్నారు.

నవనీతం నవి పిళ్లెకు నోబెల్ శాంతి బహుమతి

60 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో న్యాయ నిపుణురాలి (South African jurist)గా.. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో మానవ హక్కుల కోసం శ్రమించినందుకు నవీ పిళ్లెకు ఈ గౌరవం లభించింది. 86 ఏళ్ల వయసున్న నవనీతమ్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో పుట్టి పెరిగారు. అక్కడి నాటల్ విశ్వవిద్యాలంలో చదివి 1965లో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. ఉన్నత చదువులు చదివిన ఆమె, ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ లా స్కూల్ నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ (SJD) సాధించిన తొలి దక్షిణాఫ్రికా వ్యక్తిగా నిలిచారు.

Also Read..

దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శ‌లు

చార్మినార్‌తో రాజీవ్‌కు ఎంతో మంచి అనుబంధం ఉంది

భారత్ వీడి వెళ్లాలంటూ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారణ

Advertisement
Advertisement