Padi Kaushik Reddy | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ : పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy | రాష్ట్రంలో తాజా పరిణామాలను చూస్తుంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో తాజా పరిణామాలను చూస్తుంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పరిణామాలను చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారనేది ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బండి సంజయ్ బీజేపీలో ఉన్నారా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా..? అనేది ఆలోచన చేసుకోవాలి. బండి సంజయ్ బీజేపీ ఎజెండా మాట్లాడుతున్నారా..? లేదా రేవంత్ రెడ్డి ఎజెండా మాట్లాడుతున్నారా..? అనేది గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ఇవాళ మీరు క్లియర్‌గా చూడొచ్చు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నోట ఏ మాట వస్తదో అదే మాట బండి సంజయ్ నోట రావడం అనేది దురదృష్టకరం. బండి సంజయ్‌ను నేను ఒక్కటే అడుగుతున్నా.. కరీంనగర్ నడిబొడ్డున బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో ఫైరింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని కేటీఆర్ అన్నారు. మరి బండి తిట్టాల్సింది కేటీఆర్‌నా..? రేవంత్ రెడ్డినా..? అని పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు.
మరి ఈ రూ. 50 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..?
ప్రజలకు ధైర్యం నింపడానికి ప్రజల పక్షాన కేటీఆర్ అడిగితే.. బండి తిట్టాల్సింది ఎవర్నీ..? బండి రాజీనామా చేయాలని అడిగాను.. నాకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించింది అని అన్నారు. మరి రేవంత్ రెడ్డిని ఒక్క మాట ఎందుకు అనలేదు. రెండు సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు.. కరీంనగర్ ప్రజల పక్షాన నిలబడి.. ఫైరింగ్ అయితే రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు. సూటిగా సమాధానం చెప్పాలి. అవినీతి గురించి మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది. బండిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు.. స్టేట్‌మెంట్ ఇచ్చారు.. నేను సామాన్యుడిని.. నా భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే రూ. 50 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ రూ. 50 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..? మీరు అవినీతికి పాల్పడ్డారా..? రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా..? ప్రజలకు మాధానం చెప్పాలి అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



