MLA Madhavaram Krishna Rao | హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చరిత్ర హీనురాలు అని, తమను విమర్శించే అర్హత ఆమెకు లేదని ఎమ్మెల్యే మాధవరం తేల్చిచెప్పారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌తో హైదరాబాద్ ఎమ్మెల్యేలందరం కలిసి నడుస్తున్నాం. నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీటీ బ్యాచ్ అని ఎమ్మెల్సీ కవిత అనడం సరికాదు. ఉద్యమంలో పనిచేయకపోయేనా తాము అందరం తెలంగాణ కోసం పని చేశామని మాధవరం తెలిపారు. తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేశావు. కవిత చివరకు తన ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను విమర్శించే స్థాయి కవితకు లేదు. నీ లాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మొరిగిపోయారు. కేసీఆర్‌పై అభిమానంతో తమ ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదు. నగరంలోని ఏ బంగారం షాపును కూడా కవిత వదల్లేదు. బాలానగర్‌లో కవిత భర్త భూకబ్జాల చిట్టా ఉంది. ఓవర్ ల్యాప్ ల్యాండ్‌ని పార్టీ పేరు చెప్పుకుని క్లియర్ చేస్తున్నావు. త్వరలోనే కవిత బండారం మొత్తం బయటపెడుతామని ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. హరీశ్‌రావు పార్టీ నుంచి వెళ్లగొట్టాలన్నదే కవిత లక్ష్యం. కేటీఆర్‌ను అరెస్టు చేయించాలనే ఉద్దేశంతోనే కవిత కాంగ్రెస్ పార్టీతో దోస్తి కట్టింది. పార్టీ పేరు చెప్పుకొని 36 ఎకరాల భూమిని దోచుకుంది. కవితకు ఉన్నంత ఇల్లు కేసీఆర్‌కు కూడా లేదు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే కవిత తట్టుకోలేదు. కేసీఆర్ సార్ కోసం మాత్రమే ఊరుకుంటున్నా.. మర్యాదగా చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడాలని కవితను హెచ్చరించారు. ఇంకోసారి తమ పార్టీపై కానీ తమ ఎమ్మెల్యేలపై కానీ మాట్లాడితే ఊరుకోను. హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు. ఉద్యమం చేశామని తామేప్పుడూ చెప్పుకోలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.