త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాజకీయాల‌ను శాశ్వ‌తంగా వ‌దిలేస్తా : కేటీఆర్

KTR | రాష్ట్రంలో ఒక్క ఊరిలోనైనా రుణ‌మాఫీ 100 శాతం జ‌రిగింద‌ని నిరూపిస్తే రాజ‌కీయాల‌ను శాశ్వ‌తంగా వ‌దిలిపెట్టి పోతాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On May 6, 2026, 5.03 pm IST

KTR | రాజకీయాల‌ను శాశ్వ‌తంగా వ‌దిలేస్తా : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఒక్క ఊరిలోనైనా రుణ‌మాఫీ 100 శాతం జ‌రిగింద‌ని నిరూపిస్తే రాజ‌కీయాల‌ను శాశ్వ‌తంగా వ‌దిలిపెట్టి పోతాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. వ‌రంగ‌ల్ రైతు సంగ్రామ స‌ద‌స్సులో కేటీఆర్ మాట్లాడారు.

రుణ‌మాఫీ గురించి రాస్తే రామాయ‌ణ మంతా ఉంది.. వింటే భార‌త‌మంతా ఉంది.. బ్యాంక‌ర్ల‌తో మీటింగ్ పెడితే.. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీకి రూ. 50 వేల కోట్లు కావాల‌న్నారు. రూ. 40 వేల కోట్లు క‌డుతా.. ఒక్క ఏడాది క‌డ‌పు క‌ట్టుకుంటే.. ఎడ‌మ చేత్తో కట్టేస్తా అన్న‌డు. కానీ రూ. 12 వేల కోట్ల‌తో ఆపేశారు. ఓట్ల‌కు ముందు ఏతులు.. ఓట్లు వేసుకున్న త‌ర్వాత ఎగ‌వేత‌లు అని రేవంత్‌ను కేటీఆర్ విమ‌ర్శించారు.

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఏతుల‌, ఎగ‌వేత‌ల రేవంత్ రెడ్డి అంటున్న‌రు ప్ర‌జ‌లు. భ‌ద్ర‌కాళి త‌ల్లి బ‌రాబ‌ర్ అంతు చూస్త‌ది.. చీల్చి చెండాడుత‌ది. ఒక్క ఊరిలో కూడా రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేదు. నీకు ద‌మ్ముంటే ఏ ఊరికి పోదాం రా నువ్వు.. ఒక్క ఊరిలోనైనా 100 శాతం జ‌రిగింద‌ని నిరూపిస్తే.. రాజ‌కీయాల‌ను వ‌దిలిపెట్టి శాశ్వతంగా పోతా.. దుమ్మంటే.. రా స‌వాల్ స్వీక‌రించు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌ని మాట వాస్త‌వం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

బ్యాంకుల చుట్టు రైతులు తిరిగి తిరిగి న‌ష్ట‌పోయారు. రైతులు చ‌నిపోతున్నారు. విల‌విల‌లాడిపోతున్నారు. రైతుల ఖాతాల్లో వేసేందుకు పైస‌లు లేవ‌ట‌.. రాహుల్ ఖాతాలో వేసుకునుందుకు పైస‌లు ఉన్నాయ‌ట అని కేటీఆర్ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement