త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | క‌రోనా కంటే కాంగ్రెస్ డేంజ‌ర్ : కేటీఆర్

KTR | చెడ్డి గ్యాంగ్, క‌రోనా కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజ‌ర్ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

S

Telangana | Published On May 6, 2026, 4.42 pm IST

KTR | క‌రోనా కంటే కాంగ్రెస్ డేంజ‌ర్ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : చెడ్డి గ్యాంగ్, క‌రోనా కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజ‌ర్ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

డిక్ల‌రేష‌న్ ఇచ్చి ల‌క్ష‌ల మంది రైతుల‌ను మోసం చేసిన రాహుల్, రేవంత్ ఫొటోల‌తో పాటు డిక్ల‌రేష‌న్ కాగితాన్ని పోలీసు స్టేష‌న్లు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో అతికించి దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌.. అని రాయాలి. ఓట్ల‌ను ఎత్తుకుపోయే దొంగ నా కొడుకులున్నారు జాగ్ర‌త్త‌.. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ చ‌రిత్ర‌లోనే కాదు.. ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మోసం అని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు.

రైస్ పూలింగ్, చెడ్డి గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజ‌ర్. క‌రోనా కంటే డేంజ‌ర్ అని రైతులు అనుకుంటున్నారు. కేసీఆర్ హ‌యాంలో రైతుల ప‌రిస్థితి బాగుండే. నాటేసే స‌మ‌యానికి రైతు బంధు ప‌డుతుంటే.. అదొక విప్ల‌వం.. అబ్బుర‌ప‌డ్డ‌ది దేశం. మోదీ పీఎం కిసాన్ అని పెట్టుకున్న‌డు.. ఐక్య‌రాజ్య స‌మితి కూడా రైతుబంధు ప‌థ‌కాన్ని మెచ్చుకుని కేసీఆర్‌కు కితాబిచ్చారు అని గుర్తు చేశారు.

కేసీఆర్ హ‌యాంలో ఎక‌రానికి రూ. 10 వేలు వేశాం. రైతుల ద‌గ్గ‌ర భూమి శిస్తు, నీటి తిరువా బిల్లును తోలు వ‌లిచి వ‌సూలు చేసిన ప్ర‌భుత్వాల‌ను చూశాం.. కానీ 70 ల‌క్ష‌ల మంది రైతుల‌కు 11 విడుత‌లుగా రూ. 73 వేల కోట్లు వేసిన నేత కేసీఆర్. 75 ఏండ్ల స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ప్ర‌ధానులు, సీఎంలు చాలా మంది వ‌చ్చారు. పెట్టుబ‌డి కోసం రైతుల గురించి ఆలోచ‌న చేయ‌లేదు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో బ్ర‌హ్మాండంగా చేసుకున్నాం. కానీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రూ. 15 వేలు ఇస్తామ‌ని కాంగ్రెసోళ్లు చెప్పారు. రూ. 2 ల‌క్షలు తెచ్చుకోండి.. రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పారు. కానీ మోసం చేశారు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement