KTR | ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి..? ఎవరు చెప్పాలి..? : కేటీఆర్
KTR | గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి..? ఎవరు చెప్పాలి..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి..? ఎవరు చెప్పాలి..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు.
కాళోజీ నారాయణ రావు నా గొడవ కాదు.. నీ గొడవరా అన్నడు.. నేను అడిగేది నా ప్రశ్నలు కాదు.. రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నాం. జార్జ్ అర్విల్ అని ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన కోట్ ఏంటంటే.. In a time of deceit, telling the truth is a revolutionary act.. అంటే మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నడు. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎందుకంటే మీరు ధన్యవాద తీర్మానం పెట్టారు. ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి.. ఎవరు చెప్పాలని ఆలోచించమని కోరుతున్నాను. వంద రోజుల తర్వాత ప్రతి గ్యారెంటీని అమలు చేసే బాధ్యత మాది అని భట్టి విక్రమార్క చెప్పారు. మరి ఎక్కడ అమలవుతున్నాయి..? అని కేటీఆర్ నిలదీశారు.
4 వేల పెన్షన్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా..? లేదా 6 వేల పెన్షన్ కోసం అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా..? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా..? నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా..? డీఏలు రాక, పీఆర్సీ లేక బెనిఫిట్స్ అందక నరకయాతన పడుతున్న పది లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఔట్ సోర్సింగ్ వర్కర్లు ధన్యవాదాలు చెప్పాలా..? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు చెప్పాలా..? అని కేటీఆర్ నిలదీశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



